Homeటాప్ స్టోరీస్అరవింద సమేత వరల్డ్ వైడ్ బిజినెస్

అరవింద సమేత వరల్డ్ వైడ్ బిజినెస్

 Aravindha Sametha world wide business యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఈనెల 11 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే . త్రివిక్రమ్ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో ప్రపంచ వ్యాప్తంగా 92 కోట్ల బిజినెస్ జరిగింది . రెండు తెలుగు రాష్ట్రాలలో 70 కోట్ల బిజినెస్ జరుగగా కర్ణాటకలో 8 కోట్లకు పైగా హక్కులు అమ్ముడు పోయాయి అలాగే ఓవర్ సీస్ లో పన్నెండున్నర కోట్లు పలికింది అరవింద సమేత . ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈశా రెబ్బా నటించగా సునీల్ , జగపతిబాబు , నాగబాబు లు కీలక పాత్రల్లో నటించారు . తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కడం విశేషం . ప్రపంచ వ్యాప్తంగా 92 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి బ్రేక్ ఈవెన్ కావాలంటే ఖచ్చితంగా షేర్ వంద కోట్లు రావాలి . ఎన్టీఆర్ కు ఇంతవరకు వంద కోట్ల షేర్ రాబట్టిన చిత్రం ఏది లేదు ఆ లోటుని ఈ అరవింద సమేత తీర్చుతుందని నమ్మకంగా ఉన్నారు . దసరా సెలవులు పది రోజుల పాటు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఎన్టీఆర్ ఆ మైలురాయిని చేరుకుంటాడని భావిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .

ఇక ఏరియాల వారీగా అరవింద సమేత బిజినెస్ ఇలా ఉంది .
నైజాం – 19 కోట్లు
సీడెడ్ – 15 కోట్లు
ఉత్తరాంధ్ర – 9 . 2 కోట్లు
గుంటూరు – 7 . 2 కోట్లు
కృష్ణా – 5 . 5 కోట్లు
ఈస్ట్ – 6 కోట్లు
వెస్ట్ – 4 . 8 కోట్లు
నెల్లూర్ – 3 . 3 కోట్లు
కర్ణాటక – 8 .2 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1. 3 కోట్లు
ఓవర్ సీస్ – 12 . 5 కోట్లు
మొత్తం – 92 కోట్లు

- Advertisement -

English Title:  Aravindha Sametha world wide business

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All