Homeటాప్ స్టోరీస్అరవింద సమేతలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం

అరవింద సమేతలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం

Is Ntr playing duel role in aravinda sametha ?యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్11న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రీ కొడుకులు గా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది . రాయలసీమ కరువు రక్కసికి , రాయలసీమ ఫ్యాక్షనిజానికి బలైన తండ్రి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పెనీవిటి అనే పాటని ఎన్టీఆర్ , ఈషా రెబ్బా పైన చిత్రీకరిస్తున్నారు దర్శకులు త్రివిక్రమ్. గుండెల్ని పిండేసే ఈ పాట అరవింద సమేత లో హైలెట్ అవుతుందని , కన్నీళ్లు పెట్టించే పాట ఇదని అంటున్నారు.

ఒకరు తండ్రిగా మరొకరు కొడుకుగా ……. తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే వారసుడిగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయమని అంటున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ అన్నది ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఉండాలని దాచినట్లు తెలుస్తోంది. మరో పది రోజుల్లో అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల కానుంది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

- Advertisement -

English Title: Is Ntr playing duel role in aravinda sametha ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All