Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ చరణ్ ల సినిమా టైటిల్ ఏంటో తెలుసా

ఎన్టీఆర్ చరణ్ ల సినిమా టైటిల్ ఏంటో తెలుసా

Intresting title for NTR and CHARAN's multistarrerఎన్టీఆర్ ,రాంచరణ్ , ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబినేషన్ లో ఈరోజు భారీ ఎత్తున ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ చిత్రానికి ఆర్ ఆర్ ఆర్ అనే టైటిల్ ని వర్కింగ్ టైటిల్ గా పెట్టినప్పటికీ అసలు టైటిల్ ఏంటో తెలుసా ……. రామ రావణ రాజ్యం . అవును తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రామ రావణ రాజ్యం అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది . ఎన్టీఆర్ , చరణ్ లు మాస్ హీరోలు దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి దానికి తోడూ ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సిరీస్ ల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు స్కై లెవల్లో ఉన్నాయి .

ఎన్టీఆర్ రాజమౌళి ల కాంబినేషన్ లో మూడు చిత్రాలు రాగా అవి మూడు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి , అలాగే చరణ్ – రాజమౌళి కాంబినేషన్ లో మగధీర వంటి ప్రభంజన చిత్రం వచ్చింది . ఇక ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు . 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ అలియాస్ రామ రావణ రాజ్యం చిత్రం రూపొందుతోంది . సినిమా ఐతే ప్రారంభం అయ్యింది కానీ రిలీజ్ ఎప్పుడనేది మాత్రం జక్కన్న మాత్రమే చెప్పగలడు కానీ అది కూడా ఇప్పుడు చెప్పలేడు ఎందుకంటే ఎప్పుడు పూర్తీ అవుతుందో తనకే తెలీదు కాబట్టి . మాట వరసకు మాత్రం 2020 లో విడుదల అంటున్నారు .

- Advertisement -

English Title: Intresting title for NTR and CHARAN’s multistarrer

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All