Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ,చరణ్ ల మల్టీస్టారర్ సినిమా నేడే ప్రారంభం

ఎన్టీఆర్ ,చరణ్ ల మల్టీస్టారర్ సినిమా నేడే ప్రారంభం

RRR happend todayరామారావు , రాంచరణ్ , రాజమౌళి ల కాంబినేషన్ లో ఈరోజు ఉదయం 11 గంటలకు కొత్త సినిమా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే . ముగ్గురి పేర్లకు గుర్తుగా ” ఆర్ ఆర్ ఆర్ ” పేరుతో వర్కింగ్ టైటిల్ ని పెట్టారు జక్కన్న . డివివి దానయ్య నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి 300 కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది . ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒళ్ళు గగుర్పోడిచేలా ఉంటుందని టాక్ . స్వాతంత్ర్యానికి ముందు జరిగే పోరాట ఇతివృత్తం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గా చిత్రీకరించనున్నారు జక్కన్న . దానికి అల్యూమినియం ఫ్యాక్టరీ లో అప్పటి తాలూకు విలేజ్ సెట్ ని భారీ ఎత్తున వేసారట .

ఎన్టీఆర్ – చరణ్ లు హీరోలు రాజమౌళి డైరెక్టర్ అంటే అంచనాలు స్కై లెవల్లో ఉండటం ఖాయం దాంతో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు . టాలీవుడ్ లో అసలు సిసలైన మల్టీస్టారర్ చిత్రం గా ఆర్ ఆర్ ఆర్ నిలవబోతోంది . అయితే ఎన్టీఆర్ , చరణ్ ల సరసన ఎవరెవరు నటించనున్నారు అన్నది ఇప్పటివరకు రివీల్ చేయలేదు కాకపోతే ముగ్గురు హీరోయిన్ లు అని తెలుస్తోంది . అందునా ఒక బ్రిటీష్ భామ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది . ఎన్టీఆర్ -చరణ్ ల కాంబినేషన్ లో అందునా రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే ఫ్యాన్స్ ఆనందం వర్ణించతరమా !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All