Homeటాప్ స్టోరీస్తలైవా కాళ్లు పట్టుకున్న బేర్ గ్రిల్స్

తలైవా కాళ్లు పట్టుకున్న బేర్ గ్రిల్స్

తలైవా కాళ్లు పట్టుకున్న బేర్ గ్రిల్స్.
తలైవా కాళ్లు పట్టుకున్న బేర్ గ్రిల్స్.

భారతదేశం గురించి చెప్పాలంటే.. బంగాళాఖాతం,అరేబియాసముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు దక్షిణాన హిందూ మహాసముద్రం, కోట్లాదిమంది పవిత్రంగా భావించే గంగానది ఇంకా కోట్ల సంవత్సరాలు అయినా చెక్కు చెదరకుండా ఉన్నరామసేతు ఉన్నాయి. వీటితో పాటూ అనేకమంది మన కళ్ళముందు కదిలే కారణజన్ములు కూడా ఉన్నారు. వారిలో ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను తన మాటలతో తన మంచితనంతో తన ఫిలాసఫీ తో ఆకట్టుకుంటున్న రజనీకాంత్.. ప్రస్తుతం డిస్కవరీ ఛానల్ వారు నిర్వహిస్తున్న “ఇన్ టు ద వైల్డ్” అనే కార్యక్రమంలో సుప్రసిద్ధ వైల్డ్ లైఫ్ వ్యాఖ్యాత “బేర్ గ్రిల్స్” తో పాల్గొన్నారు.

గతంలో రిలీజ్ అయిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో లు చాలా వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళందరూ బేర్ గ్రిల్స్ కి అభిమానులు అయితే.. రాబోయే కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరూ రజనీకాంత్ కి వీరాభిమానులు అయిపోతున్నారు. తాజాగా డిస్కవరీ వారు మరొక ప్రోమో ను కూడా విడుదల చేశారు. ఆ క్రమంలో భాగంగా బేర్ గ్రిల్స్ & రజనీకాంత్ ఒక నదిని దాటవలసి రావడం.. అందులో భాగంగా ఒక పాడుబడిన వంతెన దాటే క్రమంలో రజినీకాంత్ చెప్పిన ఫిలాసఫీ బీర్ గేల్స్ ఫుల్ ఫిదా అయిపోయాడు.

- Advertisement -

“భవిష్యత్తు తరాలవారికి నీళ్ళు చాలా ముఖ్యమని…. ఎవరైతే నీళ్లను తమ ఆధీనంలో ఉంచుకుంటారో..! వారు ప్రపంచాన్ని పరిపాలించగలరు.” అని రజనీకాంత్ చెప్పారు. ఇక ఒకవైపు ఇంగ్లీషులో బేర్ గ్రిల్స్ తో మాట్లాడుతూనే మధ్య మధ్యలో తన మాతృభాష అయిన తమిళంలో రజనీకాంత్ మాట్లాడటం గమనార్హం.

“మీరు యుక్తవయస్సులో ఏమి చేసేవారు.?” అని బేర్ అడగగా తను ఒక బస్సు కండక్టర్ ననీ, మహానుభావుడైన దర్శకుడు బాలచందర్ గారు తనను గుర్తించి నటుడిగా తనకు పునర్జన్మ ఇచ్చారని.. ఆయన తనకు రజినీకాంత్ అనే పేరు ఇచ్చారని” రజినీకాంత్ గుర్తు చేసుకున్నారు.

ఇక అడవిలో ట్రెక్కింగ్ చేసిన తర్వాత, “సార్ మీరు నిజంగానే ఒక సూపర్ హీరో” అని బేర్ గ్రిల్స్ భావోద్వేగానికి గురై రజినీకాంత్ పాదాభివందనం చేసి.. రజినీకాంత్ షూ కి లేస్ కట్టారు. “మీరు తప్పుగా అనుకోకపోతే మీ వయసు తెలుసుకోవచ్చా.?” అని అడగగా తనకు 70 సంవత్సరాలు అని రజినీకాంత్ చెప్పారు. నిజంగా మీరే మా అందరికీ స్ఫూర్తి అని బేర్ గ్రిల్స్ ఎమోషనల్ గా అయ్యాడు. బరాక్ ఒబామా దగ్గర నుంచి నరేంద్ర మోడీ వరకు అందరితో ఈ షో చేసిన బేర్ గ్రిల్స్ రజినీకాంత్ గారి దగ్గర తప్ప ఎవరి దగ్గర ఇంత ఎమోషనల్ కాలేదు. నిజ జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మికమైన విషయాలను కూడా రజినీకాంత్ గారి వద్ద ఈ జర్నీలో బేర్ గ్రిల్స్ నేర్చుకొని ఉండవచ్చు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All