Homeటాప్ స్టోరీస్ర‌జ‌నీ - బేర్ గ్రిల్స్ ప్రోమో వ‌చ్చేసింది!

ర‌జ‌నీ – బేర్ గ్రిల్స్ ప్రోమో వ‌చ్చేసింది!

ర‌జ‌నీ - బేర్ గ్రిల్స్ ప్రోమో వ‌చ్చేసింది!
ర‌జ‌నీ – బేర్ గ్రిల్స్ ప్రోమో వ‌చ్చేసింది!

గ‌త ఏడాది ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో డిస్క‌వ‌రీ ఛానెల్ కోసం బేర్ గ్రిల్స్ ఓ వీడియోని షూట్ చేసి సంస‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల త‌మిళ‌ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌లో `మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్` కార్య‌క్ర‌మం కోసం ఓ డాక్యుమెంట‌రీని షూట్ చేశారు. క‌ర్ణాట‌క‌లోని బందీపూర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో దీనికి సంబంధించిన షూటింగ్ జ‌రిగింది. ముందు రోజే లొకేష‌న్‌కు చేరుకున్న ర‌జ‌నీకాంత్ ఆ త‌రువాత రోజు బేర్ గ్రిల్స్‌తో క‌లిసి బండీపూర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో షూటింగ్‌లో పాల్గొన్నారు.

డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గా ర‌జ‌నీ ప్ర‌మాదానికి గురికావ‌డం క‌ల‌క‌లం రేపించింది. అయితే తాను ప్ర‌మాదానికి గురికాలేద‌ని, తులి ప‌డ్డాన‌ని, భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని ఆ త‌రువాత ర‌జ‌నీ త‌న అభిమానుల‌కు వివ‌ర‌ణ ఇచ్చారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బేక్ గ్రిల్స్ చిత్రీక‌రించిన `మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్` కార్య‌క్ర‌మానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ ని బుధ‌వారం బేక్ గ్రిల్స్ రిలీజ్ చేశారు.

- Advertisement -

బేర్ గ్రిల్స్‌తో క‌లిసి త‌లైవ‌ర్ ర‌జ‌నీకాంత్ పోటా పోటీగా పోజులిచ్చిన ఈ మోష‌న్ పోస్ట‌ర్ ర‌జ‌నీ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది. `ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మందితో వ‌ర్క్ చేశాను. అయితే ర‌జ‌నీతో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం త‌న‌కు చాలా స్పెష‌ల్ అని ఈ సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్‌ని షేర్ చేస్తూ బేర్ గ్రిల్స్ ఓ పోస్ట్‌ని పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All