Homeటాప్ స్టోరీస్కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇలియానా

కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇలియానా

కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇలియానా
కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇలియానా

నడుమందాల భామ ఇలియానా తెలుగులో దేవదాస్ చిత్రంతో డెబ్యూ చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత చేసిన పోకిరి ఆమెకు స్టార్డంను తీసుకొచ్చింది. ఆ తర్వాత  వరసగా హిట్ సినిమాల్లో, స్టార్ హీరోలతో నటించింది ఇలియానా. ఇక్కడ టాప్ రేంజ్ ను అందుకున్న ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది.

అయితే తెలుగులో వచ్చినంత ఫేమ్ అండ్ ఫాలోయింగ్ ఆమెకు అక్కడ రాలేదు. దీంతో ఇలియానాకు కొన్ని సినిమాల తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. కాకపోతే ఇలియానా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

- Advertisement -

ఈ మధ్యనే ఇలియానా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. గత కొన్ని ఏళ్లుగా ఈ వ్యవహారం ఇండస్ట్రీలో నలుగుతోంది. కొంత మంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇక ఇలియానా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఉందని, సినిమా ఆఫర్ల కోసం నిర్మాతలు, దర్శకులు శారీరక అవసరాలు తీర్చమని అడుగుతారని ఇలియానా స్పందించింది. దీంతో కాస్టింగ్ కౌచ్ ప్రస్తావన మరోసారి వచ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All