Homeటాప్ స్టోరీస్ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వుంది: స‌్వీటీ

ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వుంది: స‌్వీటీ

ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వుంది: స‌్వీటీ
ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వుంది: స‌్వీటీ

కాస్టింగ్ కౌచ్‌.. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేసింది. బాలీవుడ్‌లో దీని ధాటికి చాలా మంది అవ‌కాశాలు కోల్పోయారు. కొంత మంది మ‌ధ్య‌లోనే తాము న‌టిస్తున్న‌, అంగీక‌రించిన చిత్రాల నుంచి త‌ప్పుకున్నారు. టాలీవుడ్‌లోనూ శ్రీ‌రెడ్డి కార‌ణంగా కాస్టింగ్ కౌచ్ ప్ర‌కంప‌ణ‌లు సృష్టించింది. అయితే టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నిజంగానే వుందా? అంటే స్వీటీ (అనుష్క) వుంద‌ని ఓపెన్‌గా చెప్పేసింది.

అయితే తన‌కు మాత్రం ఆ అనుభ‌వం ఎప్పుడూ ఎదుర‌వ్వ‌లేద‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అనుష్క ప్ర‌స్తుతం `నిశ్శబ్దం` చిత్రంలో న‌టిస్తున్నారు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో కోన వెంక‌ట్‌తో క‌లిసి టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్ర‌చారంలో భాగంగా ఓ మీడియాతో ఇంట‌రాక్ట్ అయిన అనుష్క ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేద‌ని తాను చెప్ప‌న‌ని, కానీ అదృష్ట వ‌శాత్తు త‌న‌కు అలాంటి అనుభ‌వం ఎదుర‌వ్వ‌లేద‌ని, కార‌ణం తాను ముక్కుసూటిగా మాట్లాడుతుంటాన‌ని, ఎప్పుడైతే స్త్రీ నో అని చెబుతుందో అప్పుడే పురుషుడు మ‌హిళ‌ల్ని గౌర‌వించ‌డం మొద‌లుపెడ‌తాడ‌ని వెల్ల‌డించింది.

- Advertisement -

త‌న వివాహం గురించి వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందిస్తూ `ఇలాంటి వార్త‌ల్ని ఎలా రాస్తారో త‌న‌కు అర్థం కాలేద‌ని, వ‌దంతుల‌నేవి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సాధార‌ణం. ఈ విష‌యంలో తానేవీ చేయ‌లేన‌ని, త‌న‌పై ఇలాంటి వార్త‌లు రాసేవారికి సోద‌రీమ‌ణులు వుండ‌రా అని ఆశ్చ‌ర్య‌పోతుంటా` అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ప‌త్రిక‌లు చ‌ద‌వ‌డం త‌న‌కు అల‌వాటు లేద‌ని, స్నేహితుల ద్వారానే త‌న‌పై వ‌చ్చిన పుకార్ల గురించి తెలుసుకుంటుంటాన‌ని చెప్పింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All