
టాలీవుడ్‌లో మీటూ వివాదంతో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి `మా`లో తనకు సభ్యత్వాన్నినిరాకరించారని ఛాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనకు దిగడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్కడి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూ తనకు నచ్చని వారిపై అసభ్య పదజాలంతో విమర్శలకు దిగుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది శ్రీరెడ్డి. తాజాగా రాకేష మాస్టర్ తనని ఇబ్బంది పెట్టారంటూ రచ్చ చేసిన శ్రీరెడ్డి ఇటీవల నటి కరాటే కల్యాణిపై ఓ అసభ్యకర పదజాలంతో 20నిమిషాల నిడివిగల ఓ వీడియోని రూపొందించి సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
దీంతో ఆగ్రహించిన కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి తనపై శ్రీరెడ్డి చేస్తున్న ప్రచారాన్ని వివరించింది. దీంతో సైబరాబాద్ పోలీసులు శ్రీరెడ్డిపై కేస్ ఫైల్ చేశారు. ఆమెని సంప్రదించాలని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో పోలీసులు నేరుగా చెన్నై వెళ్లి శ్రీరెడ్డికి నోటీసులు అందజేసినట్టు తెలిసింది.
గత కొంత కాలంగా శ్రీరెడ్డి, కల్యాణి మధ్య వివాదం నడుస్తోంది. తనని కల్యాణి విమర్శించిందని గతంలో శ్రీరెడ్డి ఫిర్యాదు చేయడం, కల్యాణికి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. తాజాగా శ్రీరెడ్డికి నోటీసులు ఇవ్వడంతో మళ్లీ ఎలాంటి విమర్శలకు శ్రీరెడ్డి దిగబోతోందా? అని అంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు.