Homeటాప్ స్టోరీస్మాస్ రాజా సరసన ఐటమ్ సాంగ్ లో ఇలియానా

మాస్ రాజా సరసన ఐటమ్ సాంగ్ లో ఇలియానా

మాస్ రాజా సరసన ఐటమ్ సాంగ్ లో ఇలియానా
మాస్ రాజా సరసన ఐటమ్ సాంగ్ లో ఇలియానా

మాస్ మహారాజా రవితేజ తన కెరీర్ లో ఇలియానాతో మొత్తం నాలుగు సార్లు నటించాడు. అందులో కిక్ సూపర్ డూపర్ హిట్ అవ్వగా ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రాలు ప్లాప్ అయ్యాయి. మరోసారి రవితేజతో జోడి కట్టబోతోంది ఇలియానా. అయితే ఈసారి హీరోయిన్ గా కాదు. రవితేజ హీరోగా నటిస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

కొత్త దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించడానికి ఇలియానా ఎస్ చెప్పినట్లు సమాచారం. రజిష విజయన్, దివ్యంశ కౌశిక్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

ఇలియానా ఆఖరుగా తెలుగులో అమర్ అక్బర్ ఆంథోనీ చేసింది. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత మరోసారి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక రవితేజ నటించిన మరో సినిమా ఖిలాడీ కూడా షూటింగ్ దశలో ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All