HomePolitical Newsపచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శిల్ప.. భూమా కుటుంబాల మధ్య నంద్యాల మెడికల్ కాలేజీ వివాదం

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శిల్ప.. భూమా కుటుంబాల మధ్య నంద్యాల మెడికల్ కాలేజీ వివాదం

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శిల్ప.. భూమా కుటుంబాల మధ్య నంద్యాల మెడికల్ కాలేజీ వివాదం
పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శిల్ప.. భూమా కుటుంబాల మధ్య నంద్యాల మెడికల్ కాలేజీ వివాదం

ఏపీ అసెంబ్లీలో మెడికల్ కాలేజీ లపై జరిగిన చర్చ నంద్యాలను కుదిపేస్తోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శిల్ప.. భూమా కుటుంబాల మధ్య నంద్యాల మెడికల్ కాలేజీ వివాదం అగ్గి రాజేస్తోంది ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. నంద్యాల జిల్లాలో శిల్ప .. భూమా కుటుంబాల మధ్య విభేదాలు రాయలసీమ ప్రజలకు బాగా తెలుసు..ఒకరు ఒక పార్టీలో ఉంటే ఇంకొకరు మరో పార్టీలో చేరాల్సిందే. వైసీపీలో ఉన్న భూమా కుటుంబం..అధికారంలో ఉన్న టీడీపీలో చేరగా, అంతవరకు బాబు పంచన ఉన్న శిల్ప కుటుంబం..వెంటనే వైసీపీలో చేరింది.. ఆ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్‌ అవసరం లేదు..

ప్రస్తుతం మళ్లీ రెండు కుటుంబాల మధ్య అగ్గి రాజుకుంది.. నంద్యాల మెడికల్‌ కాలేజీ ఈ అగ్నికి ఆజ్యం పోస్తోంది. పనిలో పనిగా పాత పగల్ని తవ్వుకుంటూ..కొత్త ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్‌ 17మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అందులో నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఒకటి. ఈ మెడికల్ కాలేజీ 500 కోట్లతో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూములలో నిర్మాణం జరుగుతోంది. ఈ సమయంలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

- Advertisement -

మెడికల్ కాలేజీ సమీపంలో.. శిల్ప కుటుంబానికి 30 ఎకరాల భూములు ఉన్నాయని..మెడికల్ కాలేజీ రాగానే వాటి విలువ భారీగా పెంచుకున్నారని ఆరోపిస్తున్నారు.. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శిల్ప కుటుంబం పదేపదే కృతజ్ఞతలు చెబుతోందని భూమా అఖిలప్రియ అంటున్నారు. దీనిపై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఘాటుగా స్పందించారు. ఆళ్లగడ్డలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా ఆర్టీసీ బస్టాండ్ ను తీసివేసి తమ పొలాల పక్కన నిర్మించుకున్నారని శిల్పా రవి ఆరోపించారు.

ఆ బస్టాండ్ పనికి రాకపోవడంతో.. పాత ఆర్టీసీ బస్టాండ్‌నే కొనసాగిస్తున్నారని..దీనిపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో అందరికీ తెలుసని ఎమ్మెల్యే శిల్పా రవి మండిపడ్డారు. తమ పొలాల దగ్గర నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌ను భూమా కుటుంబమే లీజుకి తీసుకున్నదని ఆరోపించారు. తమ భూములు నంద్యాల టౌన్‌లోనే ఉన్నాయని, వాటికి ఎవరు ధరలు పెంచాల్సిన అవసరం లేదని అఖిలప్రియ బురదజల్లే కార్యక్రమం మానుకోవాలని హెచ్చరించారు. ఇలా మెడికల్‌ కాలేజీ పుణ్యమా అని ఇరువర్గాల మధ్య రాజకీయం వేడెక్కింది.. ఇది ఎంత వరకు దారి తీస్తుందోనని రెండు పార్టీల కార్యకర్తలు సీరియస్‌గా చర్చించుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All