Homeటాప్ స్టోరీస్సుశాంత్ కొత్త సినిమా – “ఇక్కడ వాహనాలు నిలుపరాదు”

సుశాంత్ కొత్త సినిమా – “ఇక్కడ వాహనాలు నిలుపరాదు”

Ichata vaahanamulu nilupa raadhu movie motion poster released
Ichata vaahanamulu nilupa raadhu movie motion poster released

కాళిదాసు సినిమాతో ఎప్పుడో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగ సుశాంత్. తర్వాత అక్కినేని భజన బ్యాచ్ అందరూ కలిసి మనోడిని “కరెంట్” సినిమాకు మాక్సిమం తెలుగు జనాల పై రుద్దే ప్రయత్నం చేసారు. కానీ ఆ సినిమా లో దేవీశ్రీ ప్రసాద్ పాటలు తప్ప ఇంకేమీ జనాలకు ఎక్కలేదు. ఆ తర్వాత కూడా చాల సినిమాలతో దండయాత్ర చెయ్యడం ఫ్లాప్ అవ్వడం, రొటీన్ మ్యాటర్ అయిపొయింది. ఇక లాభం లేదనుకుని మంచి ముహుర్తం చూసి సుశాంత్ ని సైడ్ హీరోగా అల… వైకుంఠపురంలో తోసేసారు.

కానీ ఇప్పుడు మళ్ళీ సుశాంత్ హీరోగా “ఇచ్చట వాహనాలు నిలుపరాదు” అని సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఎస్.దర్శన్ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాకు రవి శంకర్ శాస్త్రి; హరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకో మొదటి నుండి అక్కినేని హీరోలలో నాగార్జున తరువాత ఆ స్థాయిలో ఎవరు సక్సెస్ కాలేదు. సుమంత్ కి కూడా ఎప్పుడో మన చిన్నప్పుడు సత్యం అనే సినిమా తప్ప ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఈ సినిమాతో అయినా, సుశాంత్ ఒక డీసెంట్ స్టార్ అనిపించుకోవాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All