Homeటాప్ స్టోరీస్మళ్ళీ సుకుమార్ అండ కావాల్సొచ్చింది

మళ్ళీ సుకుమార్ అండ కావాల్సొచ్చింది

మళ్ళీ సుకుమార్ అండ కావాల్సొచ్చింది
మళ్ళీ సుకుమార్ అండ కావాల్సొచ్చింది

స్టార్ దర్శకులు నిర్మాతలుగా మారుతుండడం ఎప్పటినుండో చూస్తున్నదే. ఇలా నిర్మాతలుగా మారినప్పుడు కేవలం నిర్మాణం మాత్రమే చూసుకోకుండా కథ, స్క్రీన్ ప్లే కూడా వాళ్ళే అందిస్తుంటారు. తమ అభిరుచులకు తగ్గ కథను సిద్ధం చేసి తమ అసిస్టెంట్ ల చేత ఆ సినిమాను డైరెక్ట్ చేయిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో స్టార్ దర్శకుల ముద్ర ఆయా సినిమాలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు కుమారి 21ఎఫ్ సినిమా తీసుకుంటే దానికి దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ అయినా కూడా సుకుమార్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ప్రతి సీన్ లో సుకుమార్ ముద్ర తెలుస్తుంది. గతంలో ఆది హీరోగా వచ్చిన గాలిపటం సినిమాకు కూడా అంతే. ఆ సినిమాకు నిర్మాత అయిన సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. ఇలాంటి సినిమాల్లో ఆయా దర్శకులకు వచ్చే పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉండవు. ఆ స్టార్ దర్శకులే క్రెడిట్ మొత్తం తీసుకెళ్లిపోతుంటారు. వాళ్ళు కావాలని చేయరు కానీ మీడియా నుండి ప్రేక్షకుల వరకూ దృష్టాంతా నిర్మిస్తున్న ఆ స్టార్ దర్శకుడిపైనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. దీంతో ఆ సినిమా హిట్ అయినా సినిమాను డైరెక్ట్ చేసేవారికి ఒరిగిందేమి ఉండదు. వేరే సినిమా చేయాల్సొచ్చినప్పుడు ఈ హిట్ సినిమాను పెద్దగా ఎవరూ కన్సిడర్ చేయరు.

పల్నాటి సూర్య ప్రతాప్ కు ఈ విషయం బాగా అర్ధమయ్యే ఉంటుంది. తన మొదటి సినిమా కరెంట్ ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్ ఎంతో ఇష్టమైన శిష్యుడు కావడంతో తనే నిర్మాతగా మారి కుమారి 21ఎఫ్ ను నిర్మించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయినా కూడా నాలుగేళ్లు ప్రతాప్ మరో సినిమాను చేజిక్కించుకోవడంలో విఫలమయ్యాడు. నాలుగేళ్లలో ఒక్క సినిమా కూడా చేయని ప్రతాప్ ను మళ్ళీ సుకుమారే ఆదుకోవడానికి ముందుకొచ్చాడు. కుమారి 21ఎఫ్ తరహాలో తానే కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మాణ భాగస్వామి కూడా అవుతూ ఒక సినిమాను సెట్ చేసాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది.

- Advertisement -

నిఖిల్ ను హీరోగా ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. అర్జున్ సురవరం కష్టాల నుండి అల్లు అరవింద్ నిఖిల్ ను బయటపడిన విషయం తెల్సిందే. దానికి ప్రతిగా నిఖిల్ వెంటనే అల్లు అరవింద్ తో సినిమా కోసం డేట్స్ ఇచ్చేసాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. నిజానికి నితిన్ హీరోగా ఈ ప్రాజెక్ట్ ను చేద్దామనుకున్నారు కానీ నితిన్ వచ్చే ఏడాదిన్నర వరకూ ఫుల్ బిజీ. తన సొంత నిర్మాణంలో సినిమా చేయడానికి కూడా నితిన్ కు తీరిక లేదు. అందుకే నిఖిల్, నితిన్ స్థానంలో వచ్చాడు. సుకుమార్ కథ అందించాడు అంటే అది కచ్చితంగా భిన్నంగా ఉంటుందని అనిపిస్తుంది. ప్రేక్షకులలో కూడా అంచనాలు బాగుంటాయి. మరి సూర్య ప్రతాప్ ఈ సినిమాతోనైనా దర్శకుడిగా తనను తాను నిరూపించుకోగలడా లేదంటే క్రెడిట్ మొత్తం మళ్ళీ సుకుమార్ కే వెళ్లిపోతుందా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All