Homeన్యూస్ఆమె చేయనంటే నేను ఈ సినిమాను ఊహించుకోలేను...

ఆమె చేయనంటే నేను ఈ సినిమాను ఊహించుకోలేను…

ఆమె చేయనంటే నేను ఈ సినిమాను ఊహించుకోలేను...
ఆమె చేయనంటే నేను ఈ సినిమాను ఊహించుకోలేను…

శర్వానంద్ తాజా చిత్రంగా రూపొందిన ఒకే ఒక జీవితం చిత్రం.. ఈ నెల 9వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. అమలగారు కుదరదంటే .. ఆమె చేయనంటే నేను ఈ సినిమాను ఊహించుకోలేను. అంతగా అమ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయారని అన్నాడు శర్వానంద్. సాధారణంగా హీరోయిన్స్ ఎన్ని సీన్స్ ఉన్నాయి.. ఎన్ని సాంగ్స్ ఉన్నాయని అడుగుతుంటారు. అలా కాకుండా రీతూ వర్మ, ఒక మంచి సినిమాలో భాగం కావాలనే ఉద్దేశంతో అంగీకరించినందుకు ఆమెకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను.

వెన్నెల కిశోర్ కి నేను ఛాన్స్ ఇప్పిస్తే ప్రమోషన్ కి రాకుండా ఎగ్గొట్టాడు .. వాడి సంగతి తరువాత చెబుతానంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. శ్రీకార్తీక్ కథ చెప్పగానే నేను కనెక్ట్ అయ్యాను .. అలాగే సినిమా చూస్తూ మీరూ కనెక్ట్ అవుతారు. ప్రామిస్ చేసి చెబుతున్నాను .. నన్ను నమ్మండి .. ఈ సారి మిమ్మల్ని డిజప్పాయింట్ చేయను. ఈ నెల 9 నుంచి థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమాను చూడండి .. మీ అందరికీ నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఒకే ఒక జీవితం మూవీ ఓ టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది.

- Advertisement -

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో అక్కినేని అమల కీలక పాత్రలో కనిపించనున్నారు. శర్వా తల్లి పాత్రలో అక్కినేని అమల నటించనున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు శర్వా. తాజాగా ఓ ఇంటర్‌వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా ఫ్లాప్ అవ్వడంతో దాదాపు మూడు నెలలు బయటకు రాలేదు అన్నారు. పడి పడి లేచే మనసు సినిమా తనను బాగా నిరాశకు గురిచేసిందని అన్నాడు శర్వా. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నా.. కానీ అలా జరగలేదు. ఒక 3 నెలల పాటు నేను బయటకు రాలేదు ఆ సినిమా రిజల్ట్ వల్ల. ఆ సినిమా ఆడుతుంది నమ్మి అని 130,140 రోజులు కష్టపడి పనిచేశాను అని చెప్పుకొచ్చాడు శర్వానంద్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All