Homeటాప్ స్టోరీస్అనుష్క‌కు ఆ విష‌యంలో తొంద‌ర లేదంట‌!

అనుష్క‌కు ఆ విష‌యంలో తొంద‌ర లేదంట‌!

అనుష్క‌కు ఆ విష‌యంలో తొంద‌ర లేదంట‌!
అనుష్క‌కు ఆ విష‌యంలో తొంద‌ర లేదంట‌!

అనుష్క త‌న పెళ్లి వార్త‌లపై మ‌రోసారి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. గ‌త కొంత కాలంగా అనుష్క పెళ్లి గురించి పుకార్లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఒక ద‌శ‌లో ప్ర‌భాస్ – అనుష్క వివాహం చేసుకోనున్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. ఇటీవ‌ల `నిశ్శ‌బ్దం` మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా సోష‌ల్ మీడియాలో అనుష్క ఫ్యాన్స్‌తో ఇంట‌రాక్ట్ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా కూడా నెటిజ‌న్స్ అనుష్క పెళ్లి గురించి ప్ర‌స్థావ‌న తీసుకొచ్చారు. పెళ్లిపై త‌న‌కున్న అభిప్రాయాన్ని తాజాగా వ్య‌క్తం చేశారామె. ప్ర‌భాస్‌తో పెళ్లి వార్త‌ల్ని కండించినా ఇప్ప‌టికి అలాంటి వార్త‌లు పుట్టుకొస్తూనే వున్నాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే వున్నాయి. తాజాగా పెళ్లి, పిల్ల‌ల వంటి అంశాల‌పై త‌న‌కున్న అభిప్రాయాన్ని అనుష్క వెల్ల‌డించింది.

- Advertisement -

తాను పెళ్లిని న‌మ్ముతాన‌ని, పిల్ల‌లు కూడా ఉండాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపింది. అయితే ఈ విష‌యంలో త‌న‌కు ఎలాంటి తొంద‌ర లేద‌ని, ఇందు కోసం చాలా టైమ్ తీసుకుని న‌చ్చిన వాడు దొరికిన‌ప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తాన‌ని స్ప‌ష్టం చేసింది. 2ఏ ఏళ్ల వ‌య‌సు నుండి త‌న త‌ల్లిదండ్రులు వివాహం గురించి ఒత్తిడి చేయ‌డం మొద‌లుపెట్టార‌ని, కానీ ప్ర‌స్తుతం త‌న మ‌న‌సు తెలుసుకుని ఒత్తిడి చేయ‌డం మానేశార‌ని తెలిపింది. సినిమాల నుంచి తాను త‌ప్పుకోన‌ని, కెరీర్‌ని ఇలాగే కంటిన్యూ చేస్తాన‌ని స్ప‌ష్టం చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All