Homeటాప్ స్టోరీస్వింటేజ్ లుక్‌లో ప్ర‌భాస్ బ‌ర్త్‌డే హంగామా!

వింటేజ్ లుక్‌లో ప్ర‌భాస్ బ‌ర్త్‌డే హంగామా!

వింటేజ్ లుక్‌లో ప్ర‌భాస్ బ‌ర్త్‌డే హంగామా!
వింటేజ్ లుక్‌లో ప్ర‌భాస్ బ‌ర్త్‌డే హంగామా!

ప్ర‌భాస్‌.. టాలీవుడ్‌లో `బాహుబ‌లి`కి ముందు ఓ స్టార్ హీరో మాత్ర‌మే.. కానీ `బాహుబ‌లి` త‌రువాత పాన్ ఇండియా స్టార్‌. ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ మాత్ర‌మే.. బాలీవుడ్ హీరోలు మాత్ర‌మే. అనే భ్ర‌మ‌లో వున్న ప్ర‌పంచానికి టాలీవుడ్ కూడా వుంద‌ని.. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సినిమాల‌ని నిర్మాణం జ‌రుగుతుంద‌ని నిరూపించారు. హాలీవుడ్ స్టార్ల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో మావాళ్లు కూడా వున్నార‌ని ఏ విష‌యంలోనూ మేమే త‌క్కువ కాద‌ని యావ‌త్ సినీ ప్ర‌పంచానికి చాటి చెప్పారు.

తెలుగు సినిమాకు ఖ్యాతికి, కీర్తిని తీసుకొచ్చిన ప్ర‌భాస్ పుట్టిన రోజు వేడుక‌ల్ని ఈ శుక్ర‌వారం జరుపుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఈ మూవీ షూటింగ్ ఇట‌లీలో జ‌రుగుతోంది. బాహుబ‌లి, సాహో చిత్రాల త‌రువాత ఆల్ ఇండియా స్టార్ అయిపోయారు. దీంతో ప్ర‌భాస్ కు సంబంధించిన ప్ర‌తీ ఈవెంట్ టాక్ ఆఫ్ ది ఇండయాగా మారుతోంది.

- Advertisement -

ప్ర‌భాస్ బ‌ర్త్‌డే అంటే హంగామా మామూలుగా వుంటుంది. ఇంట‌ర్నెట్ హీటెక్కిపోదూ.. స‌రిగ్గా ఇదే జ‌రిగింది. సోష‌ల్‌హ మీడియా మోతెక్కిపోయింది. `రాధేశ్యామ్‌` షూటింగ్ కోసం ఇట‌లీ వెళ్లిన ప్ర‌భాస్ త‌న పుట్టిన రోజు వేడుక‌ల్ని అక్క‌డే జ‌రుపుకున్నారు. వింటేజ్ లుక్‌లో బ్రౌన్ క‌ల‌ర్ జాకెట్‌లో ప్ర‌భాస్ క‌నిపించాడు. సెట్‌లో భారీ కేక్‌ని క‌ట్ చేసి యూనిట్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డేని ఘ‌నంగా నిర్వ‌హించారు. ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన `బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్‌` పేరుతో విడుద‌ల చేసినమోష‌న్ పోస్ట‌ర్ ఇప్ప‌టికి 4 మిలియ‌న్ వ్యూస్ దాటి రికార్డు దిశ‌గా ప‌య‌నిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All