Homeటాప్ స్టోరీస్నాలుగు కోట్ల నష్టం మిగిల్చిన విజేత

నాలుగు కోట్ల నష్టం మిగిల్చిన విజేత

huge loss for sai korrapati విభిన్న కథా చిత్రాలను నిర్మిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత ని నిలుపుకున్న నిర్మాత సాయి కొర్రపాటి . ఇప్పటివరకు పలు చిత్రాలను నిర్మించి తన అభిరుచి ని తెలియజేసుకున్నాడు అయితే అందులో చాలా వరకు ప్లాప్ చిత్రాలే కావడం శోచనీయం . తాజాగా ఈ నిర్మాత మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ని హీరోగా పరిచయం చేస్తూ ” విజేత ” అనే చిత్రాన్ని నిర్మించాడు . ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందని అనుకున్నారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కాదు కదా మెగా స్టార్ అల్లుడు కాబట్టి వాళ్ళ అండ అయినా ఉంటుందని అనుకుంటే వాళ్ళు కూడా ఈ సినిమాని చూడటం లేదు దాంతో విజేత ప్లాప్ జాబితాలో చేరిపోయింది .

జూలై 12న విజేత చిత్రం విడుదల అయ్యింది , ఇక ఇప్పటివరకు కనీసం కోటి రూపాయల షేర్ కూడా రాలేదు కానీ ఈ సినిమా కోసం సాయి కొర్రపాటి ఏకంగా 7 కోట్లు ఖర్చు పెట్టాడట ! ఇప్పుడు వస్తున్న వసూళ్ల ని బట్టి దాదాపుగా కలెక్షన్లు క్లోజ్ అయినట్లే ! ఇక మిగిలింది శాటిలైట్ హక్కుల రూపంలో మాత్రమే ! ఒకవేళ పెద్దగా మెగా కుటుంబం జోక్యం చేసుకున్నా 2 కోట్లకు మించి రావు . అన్నీ కలిపి మూడు కోట్ల వరకు వచ్చినా ఇంకా నాలుగు కోట్లు నష్టం అన్నమాట . ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి మెగా ఫ్యామిలీ హీరోలలో ఎవరో ఒకరు సాయి కొర్రపాటి కి డేట్స్ ఇచ్చి తీరాలి , అప్పుడే అల్లు అర్జున్ తప్పకుండా మీ బ్యానర్ లో సినిమా చేద్దామని అన్నాడట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All