Homeటాప్ స్టోరీస్కొరటాల శివ చిరంజీవి సినిమాకు కథ రెడీ

కొరటాల శివ చిరంజీవి సినిమాకు కథ రెడీ

koratala siva next with chiranjeeviవరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ లు అందుకొని సంచలనం సృష్టించాడు దర్శకులు కొరటాల శివ . మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను చిత్రాలు చేసాడు కొరటాల ఈ నాలుగు కూడా ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి దాంతో కొరటాల కు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది . ఇటీవలే భరత్ అనే నేను చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న కొరటాల శివ తాజాగా తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తో చేయడానికి రెడీ అయ్యాడు . ప్రస్తుతం చిరంజీవి ”సైరా ……. నరసింహారెడ్డి ” చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే .

సైరా పూర్తయ్యాక బోయపాటి శ్రీను తో సినిమా చేయాల్సి ఉంది చిరు కానీ కొరటాల శివ చెప్పిన రైతు కథ బాగా నచ్చిందట పైగా ఇందులో చిరు ద్విపాత్రాభినయం అని తేలడం రెండు క్యారెక్టర్ లు కూడా విభిన్నంగా ఉండటంతో వెంటనే ఓకే చెప్పేసాడు చిరు . అయితే మొదట లైన్ మాత్రమే చెప్పిన కొరటాల తాజాగా ఫుల్ నెరేషన్ ఇచ్చాడట ఇంకేముంది చిరు ఫిదా అయ్యాడని సైరా పూర్తయ్యాక కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని అంటున్నారు . ఇక ఈ సినిమాని రంగస్థలం ని నిర్మించిన మైత్రి మూవీస్ సంస్థ తో కలిసి చరణ్ సంయుక్తంగా నిర్మించనున్నాడట . కొరటాల శివ సినిమా అంటే సామాజిక అంశానికి కమర్షియల్ హంగులను అద్దె దర్శకుడని తెలిసిందే దాంతో అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .

- Advertisement -

English Title: koratala siva next with chiranjeevi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts