Homeటాప్ స్టోరీస్విజేత రివ్యూ

విజేత రివ్యూ

vijetha movie reviewవిజేత రివ్యూ :
నటీనటులు : కళ్యాణ్ దేవ్ , మాళవిక నాయర్ , మురళీశర్మ
సంగీతం : హర్షవర్ధన్
నిర్మాత : రజనీ కొర్రపాటి
దర్శకత్వం : రాకేష్ శశి
రేటింగ్ : 2. 5/ 5
రిలీజ్ డేట్ : 12 జులై 2018

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన చిత్రం ” విజేత ”. చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం టైటిల్ తో వచ్చిన ఈ విజేత చిరు చిన్నల్లుడు కళ్యాణ్ ని విజేత గా నిలిపిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

- Advertisement -

శ్రీనివాసరావు ( మురళీశర్మ ) మధ్యతరగతి వ్యక్తి దాంతో తనకిష్టమైన ఫోటోగ్రఫీ ని వదిలేసి ఉద్యోగం చేయాల్సి వస్తుంది . అయితే కొడుకు రామ్ (కళ్యాణ్ దేవ్ ) మాత్రం అల్లరిచిల్లరిగా తిరిగే వ్యక్తి , కెరీర్ గురించి పెద్దగా ఆశలు లేకుండా ఆవారాగా తిరుగుతూ తండ్రికి తలవంపులు తెస్తాడు . దాంతో తండ్రి అనారోగ్యానికి గురౌతాడు , ఆ సమయంలో రామ్ వ్యక్తిత్వంలో మార్పులు వస్తాయి . తండ్రి కోరిక ఏంటి ? అల్లరి చిల్లరిగా తిరిగే రామ్ ఎలా బాధ్యతగా మారాడు , కుటుంబం కోసం ఏం చేసాడు ? విజేత ఎలా అయ్యాడు అన్నదే మిగతా కథ .

హైలెట్స్ :

ఎమోషనల్ సీన్స్
క్లైమాక్స్

డ్రా బ్యాక్స్ :

సాగతీత సన్నివేశాలు
స్లో నేరేషన్

నటీనటుల ప్రతిభ :

చిరంజీవి చిన్నల్లుడు హీరో అనగానే కొన్ని అంచనాలు ఉంటాయి అయితే ఆ అంచనాల స్థాయిలో కళ్యాణ్ దేవ్ నటన లేదు కానీ ఫరవాలేదనిపించాడు . కొన్ని సన్నివేశాల్లో బాగానే నటించినప్పటికీ క్లోజప్ షాట్స్ లో మాత్రం తేలిపోయాడు . నటన పరంగా మరింతగా రాణించాల్సి ఉంది . హీరోయిన్ మాళవిక నాయర్ కు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో బాగానే చేసింది . ఇక ఈ సినిమాకు వెన్నెముక మురళీశర్మ నటన . సగటు మనిషి తండ్రి పాత్రలో మురళీశర్మ అభినయం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది అసలు ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా హీరోగా కథ ని ముందుకు నడిపించాడు . ఇక మిగిలిన పాత్రల్లో జయప్రకాశ్ , తనికెళ్ళ భరణి , రాజీవ్ కనకాల , సుదర్శన్ , నోయల్ , కిరీటి , మహేష్ లు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు .

సాంకేతిక వర్గం :

హర్షవర్ధన్ సంగీతం ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచింది అలాగే కేకే సెంథిల్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా అనే చెప్పాలి . సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు అమోఘం . ఇక దర్శకుడు రాకేష్ శశి విషయానికి వస్తే ……. …. హ్రదయాలకు హత్తుకునే కథ ని ఎంచుకున్నాడు మంచి సన్నివేశాలను కూడా రాసుకున్నాడు అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం తన ప్రతిభ చూపించలేక పోయాడు . ఓవరాల్ గా మెప్పించాడు కానీ సాలిడ్ హిట్ అందించలేక పోయాడు .

ఓవరాల్ గా :

కుటుంబ కథా చిత్రాలు కోరుకునే వాళ్లకు విజేత నచ్చవచ్చు

English Title: vijetha movie review

                                         Click here for English Review
YouTube video

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All