Homeటాప్ స్టోరీస్విజయ్ రికార్డుల మోత మోగించనున్నాడా ?

విజయ్ రికార్డుల మోత మోగించనున్నాడా ?

Huge expectations on vijay's Sarkarతమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్రం నవంబర్ 6 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . విజయ్మురుగదాస్ ల కాంబినేషన్ లో వచ్చిన తుపాకి , కత్తి చిత్రాలు సంచలన విజయాలు సాధించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సర్కార్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2500 ల థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నారు , ఇక తెలుగులో రికార్డ్ స్థాయిలో ఏకంగా 750 థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు . విజయ్ స్టార్ హీరో దాంతో మొదటి రోజు రికార్డుల మోత మోగడం ఖాయం . నాన్ బాహుబలి రికార్డులు ఎలాగూ బద్దలౌతాయి విజయ్ కున్న క్రేజ్ తో .

విజయ్ కి తెలుగునాట అంతగా క్రేజ్ లేదు కానీ మిగతా అన్ని ప్రాంతాల్లో బాగానే క్రేజ్ ఉంది దాంతో తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే రికార్డుల మోత మోగడం ఖాయం . విజయ్ క్రేజ్ కు తోడూ దీపావళి పండగ కూడా కాబట్టి టపాసుల మోత తో పాటుగా రికార్డుల మోత కూడా మోగడం ఖాయం . విజయ్ సరసన కీర్తి సురేష్ నటించగా కీలక పాత్రలో హాట్ భామ వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది . నవంబర్ 6 న విడుదల కానున్న ఈ చిత్రానికి వివాదాలు కూడా చుట్టూముడుతున్నాయి . ఇక రేపు సినిమా రిలీజ్ అయ్యాక రాజకీయ వర్గాల నుండి కూడా ఎన్ని వివాదాలు చుట్టుకుంటాయో !

- Advertisement -

English Title: Huge expectations on vijay’s Sarkar

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All