Homeటాప్ స్టోరీస్వేరే వాళ్ళ కథలను దొంగిలించడం ఈ దర్శకుడి నైజమా ?

వేరే వాళ్ళ కథలను దొంగిలించడం ఈ దర్శకుడి నైజమా ?

Copy allegations on director murugadossవేరే వాళ్ళ కథలను ఎంచక్కా లేపేయడం స్వల్ప మార్పులు చేసుకొని సినిమాలు తీయడం ,హిట్స్ కొట్టడం ……. భారీగా సొమ్ము చేసుకోవడం కామన్ అయిపొయింది సినిమారంగంలో . టాలీవుడ్ లో అలాంటి ప్రముఖులు చాలామందే ఉండగా కోలీవుడ్ లోనూ అలాంటి కాపీ రాయుళ్ళు చాలామందే ఉన్నారు . ఆ కోవలోని వ్యక్తీ మురుగదాస్ . సామాజిక అంశాలతో చిత్రాలను తీస్తాడని పేరున్న దర్శకుడు ఈ మురుగదాస్ అయితే తాజాగా సర్కార్ చిత్ర కథ నాదే అంటూ వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత కోర్టు ని ఆశ్రయించాడు కానీ మురుగదాస్ మాత్రం సర్కార్ కథ నాది అని అంటున్నాడు . దాంతో సర్కార్ చిత్రం సకాలంలో విడుదల అవుతుందా ? అన్న అనుమానం నెలకొంది .

గతంలో కూడా ఈ దర్శకుడి పై నరసింహారావు అనే యువ దర్శకుడు ఫిర్యాదు చేసాడు . విజయ్ హీరోగా వచ్చిన కత్తి కథ నాదే అంటూ ఫిల్మ్ చాంబర్ పెద్దలను సంప్రదించగా అప్పట్లో దాసరి నారాయణరావు జోక్యం చేసుకొని అతడికి న్యాయం జరిగేలా చేసాడు . అతడి పేరు వేయలేదు కానీ డబ్బులు మాత్రం ఇచ్చారు . ఆ కథ నరసింహారావు దే అని , మురుగదాస్ కాపీ కొట్టాడని తేల్చేసారు . కట్ చేస్తే ఇప్పుడు అదే హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్ర కథ నాది అంటూ రాజేంద్రన్ అనే వ్యక్తీ కోర్టుకెక్కాడు . ఈనెల 30 న కోర్టు విచారణ లో ఏమి తేలుతుందో తెలుస్తుంది . అయితే ఇలాంటి ఆరోపణలు వస్తున్నప్పటికీ మురుగదాస్ మాత్రం కాపీ కాదు నా కథ అంటూ మోసం చేస్తున్నాడు . ఎవరో రాసుకున్న కథ ని దొంగిలించడం స్వల్ప మార్పులు చేసి నాదే అనడం ముమ్మాటికి క్షమించరాని నేరం కానీ మురుగదాస్ కు ఇమేజ్ ఉంది కాబట్టి , ఫిర్యాదు చేస్తున్న వాళ్ళు అనామకులు కాబట్టి మురుగదాస్ ఇష్టారాజ్యం అయిపొయింది .

- Advertisement -

English Title: Copy allegations on director murugadoss

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All