Homeటాప్ స్టోరీస్అక్కడ ప్రభంజనమే.... మరి ఇక్కడ పరిస్థితి ?

అక్కడ ప్రభంజనమే…. మరి ఇక్కడ పరిస్థితి ?

Huge expectations on vijay's SARKAR in tamil naduతమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్రానికి అడ్డంకులు అన్నీ తొలగడంతో ఎట్టకేలకు విడుదలకు మార్గం సుగమం అయ్యింది . మురుగదాస్ – విజయ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సర్కార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఆ అంచనాలకు తగ్గట్లుగా టీజర్ ఉండటంతో అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి . ఇక ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడానికి పలువురు పోటీ పడగా వల్లభనేని అశోక్ తెలుగు హక్కులు దక్కించుకున్నాడు. మురుగదాస్ – విజయ్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు తుపాకి , కత్తి చిత్రాలు రాగా రెండు కూడా ప్రభంజనం సృష్టించాయి దాంతో సర్కార్ హాట్ కేక్ అయ్యింది .

తమిళనాట విపరీతమిన క్రేజ్ ఉన్న విజయ్ కి ఈ సర్కార్ చిత్రం 62 వ సినిమా కావడం విశేషం . విజయ్ సరసన కీర్తి సురేష్ నటించగా కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 6 న విడుదల కానుంది . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయి దాంతో సెన్సార్ లో ఇబ్బందులు తప్పవని అనుకున్నారు . అయితే ఆ సమస్యని అధిగమించి వస్తున్నాడు సర్కార్ . తమిళనాట ఎలాగూ ప్రభంజనం సృష్టించడం ఖాయం మరి తెలుగులో ఏంటో పరిస్థితి .

- Advertisement -

English Title: Huge expectations on vijay’s SARKAR in tamil nadu

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All