
ఈ మధ్య పాపులర్ కావాలన్నా.. అవకాశాలు పొందాలన్నా ఫొటోషూట్‌లు కామన్. ఇక ఈ విషయంలో హీయిన్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో తమ క్రేజ్ తగ్గుతోందన్న అనుమానం కలిగిందా వెంటనే ఫొటోషూట్‌లతో రచ్చ రచ్చ చేసేస్తుంటారు. ఆ తరువాత అవకాశాల్ని పట్టేస్తుంటారు. మరి యాంకర్స్ పరిస్థితి ఏంటీ? వారిదీ ఇదే దారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
బుల్లితెర యాంకర్‌లు అనసూయ.. శ్రీముఖి.. రష్మీగౌతమ్.. `పోరా పోవే` యాంకర్ విష్ణు ప్రియ.. వీళ్లంతా కూడా ఫొటో షూట్‌లనే నమ్ముకుంటున్నారు. యాంకర్‌లుగా నిలబడాలంటే హాట్ ఫోటోషూట్స్ చేయాల్సిందేనా.. ?.. స్క్రీన్‌పై కనిపించాలంటే అందంగా ముస్తాబైతే చాలు.. కానీ ప్రొగ్రామ్‌ని రక్తికట్టించాలంటే టాలెంట్ వుంటే సరిపోతుంది.. అయితే మన యాంకరమ్మలు మాత్రం అంతకు మించి ఎట్రాక్ట్ చేయాలంటే హాట్ ఫొటో షూట్‌లు చేయాల్సిందే అంటూ హంగామా చేస్తున్నారు.
స్టార్లుగా ఎదిగేందుకేనా? యాంకర్లు హాట్ ఫొటో షూట్‌లకు ఎగబడుతున్నారు అన్నది టీవీ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మధ్య అనసూయ, శ్రీముఖి కూడా వరుస ఫొటో షూట్‌లతో సందడి చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 3తో పాపులర్ అయిన శ్రీముఖి క్రేజ్ ఇటీవల తగ్గినట్టు కనిపిస్తోంది. దీంతో శ్రీముఖి టీవీ ప్రొగ్రామ్‌లతో పాటు సినిమాల్లో.. వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఫొటో షూట్‌లతో హల్‌చల్ చేస్తోంది. అనసూయ తీరు మరోలా వుంది. ఫొటో షూట్‌లలో చిట్టి పొట్టి గౌన్‌లలో కనిపించేందుకు .. థై షో చేయడానికి కూడా అనసూయ వెనుకాడటం లేదు. `రంగస్థలం`తో మంచి గుర్తింపు దక్కినా.. చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌లు వున్నా అనసూయ హాట్ షో మాత్రం ఆపడం లేదు. ఇక మిగతా యాంకర్‌లు కూడా అనసూయ, శ్రీముఖి తరహాలోనే ఫొటోషూట్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక దశలో ఇవి మరీ మితిమీరి పోతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొంత మందికి ఈ ఫొటో షూట్‌లు అవకాశాల్ని తెచ్చపెడితే అనసూయ లాంటి వాళ్లకు కొత్త ఇబ్బందుల్ని తెచ్చిపెడుతున్నాయి.