
రష్మీ గౌతమ్ .. బుల్లితెరపై జరిగే ఎక్స్ట్రా జబర్దస్ట్ చూసేవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరిది. బుల్లితెరపై చలాకీగా యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్‌ని తనదైన మార్కు ఎంటర్‌టైన్‌మెంట్‌తో మెస్మరైజ్ చేస్తున్న రష్మీగౌతమ్ సోషల్ మీడియాలోనూ అంతే చలాకీగా స్పందిస్తూ వుంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్‌కి సంబంధించిన పిక్స్‌ని షేర్ చేస్తూ టచ్‌లో వుంటోంది.
సామాజిక అంశాల విషయంలోనూ అగ్రెసీవ్‌గా స్పందించే రష్మీ గౌతమ్ లాక్‌డౌన్ సమయంలోనూ తన గొప్ప మనసుని చాటుకుంది. ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న వీధి కుక్కలకు తనే స్వయంగా ఆహారం వండి పెట్టి ఆదర్శింగా నిలిచింది. పది మందికి చెప్పడం కాదు చేసి చూపించాలని, ముందు మనం పాటించిన తరువాతే పదిమందికి చెప్పాలని నిరూపించింది.
తాజాగా ఓ నెటిజన్ రష్మిని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించడం ఆసక్తికరంగా మారింది. ఆర్ ఆర్ బీ కి ప్రిపేర్ అవుతున్నానని, అయితే దానికి సంబంధించిన బుక్స్ కొనుక్కునే స్థోమత తన వద్ద లేదని, ఆ బుక్స్ కొనిచ్చి తనకు అండగా నిలవాలని అభ్యర్ధించాడు. ఈ ట్వీట్‌కి స్పందించిన రష్మీ గౌతమ్ సదరు నెటిజన్ అడ్రస్ ఇమ్మని, ఆ బుక్స్‌ని తానే పంపిస్తానని బదులివ్వడం విశేషం.