Homeగాసిప్స్లీగ‌ల్ చిక్కుల్లో స్టార్ హీరోయిన్‌!

లీగ‌ల్ చిక్కుల్లో స్టార్ హీరోయిన్‌!

లీగ‌ల్ చిక్కుల్లో స్టార్ హీరోయిన్‌!
లీగ‌ల్ చిక్కుల్లో స్టార్ హీరోయిన్‌!

స్టార్ స్టార్ హీరోయిన్ లీగ‌ల్ చిక్కుల్లో ఇరుక్కుంది. త‌ను స‌హ న‌ర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన చిత్రం నేపాలీల‌ను కించ‌ప‌రిచేలా వుంద‌ని కొంత మంది అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో పోలీసులు ఆమెకు లీగ‌ల్ నోటీసులు జారీ చేశారు. ఆ స్టార్ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు అనుష్క శ‌ర్మ‌. ఆమె స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన వెబ్ సిరీస్ `పాతాల్ లోక్‌`. అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 18న విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డం, థియేట‌ర్లు మూసివేయ‌డంతో జ‌నాలంతా ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ల‌ని న‌మ్ముకుంటున్నారు. దీంతో వీటిని భారీ డిమాండ్ ఏర్ప‌డింది. విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందిన `ప‌తాల్ లోక్‌` వెబ్ సిరీస్ కు కూడా మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఈ వెబ్ సిరీస్‌లోని రెండ‌వ ఎపిసోడ్‌లో నేపాలీల‌ను కించ‌ప‌రిచే కొన్ని డైలాగ్‌లున్నాయి.

- Advertisement -

దీంతో నేపాల్‌కి చెందిన గోర్ఖా క‌మ్మూనిటీ `పాతాల్ లోక్‌` మేక‌ర్స్‌కి లీగ‌ల్ నోటీసులు పంపించింది. దీనిపై అనుష్క ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. దీంతో బ్రాడ్‌కాస్టింగ్ విభాగానికి గోర్ఖా క‌మ్యూనిటీ వ‌ర్గాలు ఫిర్యాదు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇటీవ‌ల నేపాల్ ప్ర‌ధాని భార‌త్ నుంచి వ‌చ్చే క‌రోనానానే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో తాజా సంఘ‌ట‌న రాజ‌కీయ రంగు పుల‌ముకునే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All