Homeటాప్ స్టోరీస్ఫొటోస్టోరీ: విరుష్క‌ల ప్ర‌య‌ణ రాగానందం!

ఫొటోస్టోరీ: విరుష్క‌ల ప్ర‌య‌ణ రాగానందం!

Virat Anushka kissing pic goes viral
Virat Anushka kissing pic goes viral

బాలీవుడ్‌లో ప్రేమాయ‌ణాలు కొత్తేమీ కాదు. క్రేజ్ వున్నంత కాలం డేటింగ్ చేసి, పార్టీలు, ప‌బ్బుల్లో చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరిగిన జంట‌లు ఆ త‌రువాత మోజు తీరిపోవ‌డంలో బ్రేక‌ప్ చెప్పుకుని మ‌రోక‌రితో ప్రేమ‌లోప‌డ‌టం అక్క‌డ స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. అయితే కొన్ని జంట‌లు మాత్ర‌మే డేటింగ్ చేస్తూపీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలుతున్నారు. మ‌రి కొంత మంది త‌మ ప్రేమ‌ను పెళ్లి వ‌ర‌కు తీసుకెళ్లి వివాహ బంధంతో ఒక్క‌ట‌వుతున్నారు. అలా పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి వివాహ బంధంతో ఒక్క‌టైన ల‌వ్‌బ‌ర్డ్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌.

ఇండియ‌న్ క్రికెట్‌లో విరాట్ రారాజు అన్న విష‌యం తెలిసిందే. ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టుకు సార‌థిగా చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాలు అందించిన విరాట్‌, బాలీవుడ్ క్రేజీ లేడీ అనుష్క శ‌ర్మ‌తో ప్రేమాయ‌ణాన్ని సాగించాడు. ఎక్క‌డ మ్యాచ్‌లు జ‌రిగితే అక్క‌డికి విరాట్ కోసం అనుష్క వెళ్ల‌డం, అక్క‌డ మీడియాకు కంట‌ప‌డ‌టం చివ‌రికి ప‌తాక శీర్ష‌క‌ల్లోకి ఎక్క‌డం అప్ప‌ట్లో నిత్య కృత్యంగా మారింది. ఇంత తిరుగుతున్న వీరి ప్రేమ పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళుతుందా అని విమ‌ర్శించిన వారూ వున్నారు. ఫైన‌ల్‌గా ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో అనుష్క‌, విరాట్‌లు బ్రేక‌ప్ చెప్పుకున్నారు కూడా.

- Advertisement -

అయినా ఇద్ద‌రికి ఒక‌రంటే ఒక‌రికి ప్రేమ త‌గ్గ‌క‌పోవ‌డం, ఎడ‌బాటు వారిని మ‌రింత ద‌గ్గ‌ర చేయ‌డంతో 2017 స‌రిగ్గా ఇదే నెల 11న డెస్టినేష‌న్ వెడ్డింగ్‌తో ఇద్ద‌రు ఒక్క‌ట‌య్యారు. అల‌క‌లు, వైరాగ్యం, చివ‌రికి బ్రేక‌ప్ దాకా వెళ్లిన విరుష్క‌ల ప్ర‌ణ‌యం చివ‌రికి అనూహ్య మ‌లుపులు తిరిగి వివాహ బంధంతో ఒక్క‌టి కావ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి, ఆనందానికి గురిచేసింది. అప్ప‌టి నుంచి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ ప్రేమ జంట డిసెంబ‌ర్ 11తో త‌మ విహం చేసుకుని రెండేళ్లు పూర్తి చేసుకుని మూడ‌వ  వ‌సంతంలోకి ప్ర‌వేశించింది. ఈ సంద‌ర్భంగా విరాట్ కోహ్లీ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేసిన ఫొటో  `మా ఇద్ద‌రి మ‌ధ్య అనిర్వ‌చ‌నీయ‌మైన ప్రేమే వుంది మ‌రొక‌టి లేదు. ప్ర‌తీ రోజు మిమ్మ‌ల్ని అర్థం చేసుకున్న వ్య‌క్తి మీతోడుండాల‌ని ఆ దేవుడు మిమ్మ‌ల్ని ఆశీర్వ‌దించిన‌ప్పుడు క‌లిగే ఆనందం మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం అనే భావ‌న క‌లిగేలా విరాట్ పెట్టిన పోస్ట్ ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All