Homeటాప్ స్టోరీస్కారుతో భారీ యాక్సిడెంట్ చేసిన స్టార్ హీరో కొడుకు

కారుతో భారీ యాక్సిడెంట్ చేసిన స్టార్ హీరో కొడుకు

hero vikram son dhruv car accidentతమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ కారుతో భారీ యాక్సిడెంట్ చేయడం సంచలనం సృష్టించింది . అత్యంత వేగంగా వచ్చి ఆటో ని గుద్దడంతో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి దాంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది ఇక ధృవ్ ప్రయాణించిన కారు బాగా దెబ్బతింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఈరోజు తెల్లవారు ఝామున జరిగింది . ఈరోజు తెల్లవారు ఝామున చెన్నై లోని పాండీబజార్ లో వేగంగా కారు నడుపుకుంటూ వచ్చాడు యంగ్ హీరో ధృవ్ , అయితే కారు చాలా వేగంగా రావడం వల్ల అదుపుతప్పి పక్కనే ఉన్న ఆటో ని బలంగా డీ కొట్టింది . ఆ ఆటోలో ఉన్న డ్రైవర్ కాళ్ళు విరిగాయి యాక్సిడెంట్ కు అంతేకాదు అతడి పరిస్థితి కూడా విషమంగా ఉంది .

ప్రస్తుతం ఆటో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు , 24 గంటలు గడిస్తే కానీ అతడి పరిస్థితి ఏంటి అన్నది అర్ధం కాదు . ఇక హీరో ధృవ్ యాక్సిడెంట్ చేసిన సంఘటన పోలీసులకు తెలియడంతో కారుని స్వాధీనం చేసుకొని అతడ్ని ప్రశ్నిస్తున్నారు . యంగ్ హీరో ధృవ్ ప్రస్తుతం అర్జున్ రెడ్డి రీమేక్ లో నటిస్తున్నాడు . తెలుగునాట ప్రభంజనం సృష్టించిన అర్జున్ రెడ్డి తమిళ్ లో ” వర్మ” గా రీమేక్ అవుతోంది . అయితే ధృవ్ మద్యం మత్తులో ఈ యాక్సిడెంట్ చేసినట్లుగా తెలుస్తోంది .

- Advertisement -

English Title: hero vikram son dhruv car accident

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All