
లాక్‌డౌన్ సమయంలో `బీ ద రియల్ మెన్` ఛాలెంజ్ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే సందీప్ రెడ్డి వంగ నుంచి మొదలైన ఈ ఛాలెంజ్ అప్పట్లో స్టార్ హీరోల చుట్టూ తిరిగి సైలెంట్ అయిపోయింది. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మళ్లీ మొదలైంది. ప్రభాస్ నుంచి ఈ ఛాలెంజ్‌ని తెరాస ఎంపీ సంతోష్ కుమార్ రెండవ విడత ప్రారంభించారు. దీనికి ఇండస్ట్రీ వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
ఇదిలా వుంటే హీరో శ్రీవిష్ణు వినూత్న ఛాలెంజ్‌కి శ్రీకారం చుట్టారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో శ్రీవిష్ణు విసిరిన ఛాలెంజ్ ఆలోచింపజేస్తోంది. కరోనా బారిన పడి కోలుకున్న వారు కరోనాతో బాధపడుతున్న వారికి తమ ప్లాస్మాని దానం చేస్తే వారిని కాపాడవచ్చనే వార్తలు ఈ మధ్య వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
`డొనేట్ ప్లాస్మా సేవ్ లైఫ్` అనే ఇమేజ్‌ని ట్విట్టర్ ప్రొఫైల్‌గా పెట్టుకోవాలని యంగ్ హీరో శ్రీవిష్ణు ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరహాలోనే సెలబ్రిటీలంతా ఈ ప్లాస్మా ఛాలెంజ్‌లో పాల్గొనాలని తద్వారా వారి అభిమానులు కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటారని, కరోనా కారణంగా సీరియస్‌గా వున్న వారి ప్రాణాలని ఈ పద్దతి ద్వారా రక్షించవచ్చని శ్రీవిష్ణు ఆలోచన. దీన్ని అంతా ఆచరించి కొంత మందినైనా కరోనా బారి నుంచి రక్షిస్తారని ఆశిద్దాం.