HomeVideosహీరో సందీప్ మాధవ్, దర్శకుడు సముద్ర చేతుల మీదుగా విడుదలైన "బిహైండ్ సమ్ వన్" టీజర్

హీరో సందీప్ మాధవ్, దర్శకుడు సముద్ర చేతుల మీదుగా విడుదలైన “బిహైండ్ సమ్ వన్” టీజర్

హీరో సందీప్ మాధవ్, దర్శకుడు సముద్ర చేతుల మీదుగా విడుదలైన "బిహైండ్ సమ్ వన్" టీజర్
హీరో సందీప్ మాధవ్, దర్శకుడు సముద్ర చేతుల మీదుగా విడుదలైన “బిహైండ్ సమ్ వన్” టీజర్

కాయిన్ ఎర్త్ క్రియేషన్స్ పతాకంపై రాజ్ సూర్యన్, నివిక్ష నాయుడు జంటగా అజయ్ నాలి దర్శకత్వంలో డాక్టర్ సింగవరం సునీల్ కుమార్ సింగ్ నిర్మిస్తున్న ద్విభాషా  చిత్రం “బిహైండ్ సమ్ వన్” (What, Why, Who) అనేది ట్యాగ్ లైన్. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు సముద్ర,” జార్జ్ రెడ్డి” హీరో సందీప్ మాధవ్ లు తెలుగు టీజర్ ను లాంచ్ చేయగా,  బిజెపి నేత శ్రీనివాస్ నేత, స్పార్క్ ఓటిటి చైర్మన్ మాచానూర్ సాగర్ లు హిందీ టీజర్ ను విడుదల చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో

ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు సముద్ర మాట్లాడుతూ ..ఒక కొత్త కథ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి వస్తున్న  ఈ యంగ్ టీం ను మనమంతా ఆశీర్వదించాలి.టీజర్ చాలా బాగుంది. ప్రస్తుతం క్రైమ్,సస్పెన్స్ , థ్రిల్లర్ సినిమాలకు మంచి సక్సెస్ రేట్ ఉంది.అలాంటిది దర్శక, నిర్మాతలకు ఇది మొదటి చిత్రమైనా డేర్ చేసి క్రైమ్ర్ సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేరుకొని తెలుగు, హిందీ భాషలలో విడుదల చేస్తున్నారు.ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాలు నిర్మాత సునీల్ మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను. మంచి ట్యాలెంట్ ఉన్న యుంగ్ టీం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న “బిహైండ్ సమ్ వన్” చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

- Advertisement -

జార్జ్ రెడ్డి హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. టీజర్ చూస్తుంటే గూస్ బమ్స్ వస్తున్నాయి. ఇలాంటి సబ్జెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం చాలా కష్టం. అయితే అమ్మాయిల మీద జరుగుతున్న మర్థర్స్ ను అరికట్టాలనే తలంపుతో దర్శక, నిర్మాతలు సస్పెన్స్ ను క్రైమ్ స్టోరీని సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకొని చాలా చక్కగా తీశారు. ఒక్క తెలుగులోనే కాక హిందీ లో కూడా విడుదల చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

హీరో సందీప్ మాధవ్, దర్శకుడు సముద్ర చేతుల మీదుగా విడుదలైన "బిహైండ్ సమ్ వన్" టీజర్
హీరో సందీప్ మాధవ్, దర్శకుడు సముద్ర చేతుల మీదుగా విడుదలైన “బిహైండ్ సమ్ వన్” టీజర్

చిత్ర దర్శకుడు అజయ్ నాలి మాట్లాడుతూ..ఉమెన్ అట్రాసిటీ పైన జరిగే ఇన్సిడెంట్ ను, బ్రూటల్ మర్డర్స్  అన్నిటినీ బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. బయట ఎన్నో
అమ్మాయిలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నా.. మర్డర్ చేసిన వారికి సరైన శిక్ష పడటం లేదు అని చెప్పేదే “బిహైండ్ సమ్ వన్” .ఈ సినిమాను నేను ఇలా చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి.నేను చెప్పిన కథను మొదట మా ప్రొడ్యూసర్ కూడా ఒప్పుకోలేదు. అయితే  ఇలాంటి సినిమాను చూపిస్తే జనాల్లో భయం రావడమే కాకా ఇలాంటి దారుణాలు చేసే వారిని అపగలుగుతాము ఆని చెప్పడంతో సునీల్ అన్న ఈ సినిమా తీయడం జరిగింది.తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సునీల్ అన్న అన్ని విధాలుగా సహకరిస్తూ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా నిర్మించడం జరిగింది. నటీ, నటులు అందరూ చాలా చక్కగా నటించారు. టెక్నిసిషన్స్ అందరూ చాలా కష్టపడ్డారు.డి.ఓ.పి వెంకట్ చాలా హార్డ్ వర్క్ చేశారు.యోగి గారు , సుబ్బయ్య గార్ల  ఎంకరేజ్ మెంట్,సునీల్ అన్న సపోర్ట్ మరువలేనిది.సినిమా బాగా వచ్చింది. ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ కచ్చితంగా చూడాలని కోరుతున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత డాక్టర్ సింగవరం సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఎన్నో హిట్స్ ఇచ్చిన దర్శకుడు సముద్ర గారు,అలాగే యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో సందీప్, శ్రీనివాస్ నేత, స్పార్క్ ఓటిటి చైర్మన్ మాచానూర్ సాగర్, లతో పాటు మా టీజర్ విడుదల కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రవాలనుకున్న టైం లో దర్శకుడు అజయ్ మర్డర్స్, మిస్టరీ కథ చెప్పగానే మొదట వద్దన్నాను. తరువాత అందరూ సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న సమస్యలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలి అని చెప్పడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. దర్శకుడు నాకు చెప్పిన కథను చెప్పినట్లు చేశారు. తెలుగు, హిందీ రెండు భాషల్లో ఒకే సారి “బిహైండ్ సమ్ వన్” చిత్రాన్ని షూట్ చేయడం జరిగింది.నటీనటులు, టెక్నిసిషన్స్, అందరూ డెడికేటెడ్ గా వర్క్ చేస్తూ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నాను అన్నారు.

చిత్ర హీరో రాజ్ సూర్యన్ మాట్లాడుతూ.. కన్నడలో నేను ఐదు సినిమాలు చేశాను. తెలుగులో నేను చేసిన మొదటి స్ట్రెయిట్ సినిమా “నా పేరు రాజా” త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది.ఆ తర్వాత చేస్తున్న రెండవ సినిమా  “బిహైండ్ సమ్ వన్”.ఈ చిత్రం నాకు తెలుగులో మంచి బ్రేక్ నిస్తుందని ఆశిస్తున్నాను.ఇలాంటి మంచి క్రైమ్, థ్రిల్లర్ సబ్జెక్ట్ కు నన్ను సెలెక్ట్ చేసుకున్న దర్శక,నిర్మాతలకు దాన్యవాదాలు అన్నారు.

చిత్ర హీరోయిన్ నివిక్షా నాయుడు మాట్లాడుతూ.. ఇది నా మొదటి చిత్రం సౌత్ ఇండియాలో “బిహైండ్ సమ్ వన్” లాంటి మూవీ చేయడం చాలా కష్టం.అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు.ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

పింగ్ పాంగ్ సూర్య మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను ముస్లిం క్యారెక్టర్ చేశాను.నా పాత్ర చాలా బాగుంటుంది. నాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి వెనుక ఒకరు వుంటారు.అనేదే “బిహైండ్ సమ్ వన్”.తెలుగు ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఉన్న సినిమా చూయించాలని ఈ సినిమాను చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఇలాంటి వారు ఇండస్ట్రీ కి కావాలి.టీజర్ చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాదించాలి అన్నారు.

నటి సహర్ కృష్ణ మాట్లాడుతూ..ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

శ్రీనివాస్ నేత మాట్లాడుతూ..  .ఒక తండ్రికి కూతురు, ఒక తల్లికి కొడుకు బిహైండ్ సమ్ వన్ ఎలాగో అలా ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక బిహైండ్ సమ్ వన్ ఉంటుంది. ఒక చక్కటి థ్రిల్లింగ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా అజయ్ , సునీల్ లకు  మొదటి చిత్రం అయినా ఎంతో పట్టుదలతో నిర్మించారు.వారికి ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో పాటు చిత్ర యూనిట్ కూడా మంచి మెసేజ్ ఉన్న కథాంశంతో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని ప్రసంగించారు

నటీనటులు
రాజ్ సూర్యన్. నివిక్షా నాయుడు,సహర్ కృష్ణ ,రవి బాబు, అజయ్, సుమన్ తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : కాయిన్ ఎర్త్ క్రియేషన్స్
ప్రొడ్యూసర్ : డాక్టర్ సింగవరం సునీల్ కుమార్ సింగ్
కో ప్రొడ్యూసర్ : సింగవరం సురేష్ కుమార్ సింగ్
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్ : పండు గాయల సుబ్బయ్య
డైరెక్టర్ అజయ్ నాలి
సినిమాటోగ్రఫీ : వెంకట్ ఆనెమ్
మ్యూజిక్ : విజయ్ కురవ్ కుల్ల
ఎడిటింగ్ : క్రాంతి.ఆర్కే
లిరిక్స్ : రాంబాబు గోశాల
కొరియోగ్రఫీ :రజిని
ప్రొడక్షన్ డిజైనర్ : యోగానంద్
ఫైట్స్ : రవి
స్టిల్ : ఎస్.మనీ చిన్న శ్రీకాంత్
అసిస్టెంట్ ఎడిటర్ : సంతోష్ పెద్ది
డిజిటల్ : ధీరజ్, ప్రసాద్
పబ్లిసిటీ డిజైనర్ : తమిళ్ చేజియన్
పి ఆర్ ఓ : లక్ష్మి నివాస్

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All