Homeటాప్ స్టోరీస్పుష్ప మంగళం శ్రీనుగా సునీల్.. లుక్కు అదుర్స్..!

పుష్ప మంగళం శ్రీనుగా సునీల్.. లుక్కు అదుర్స్..!

Pushpa Sunil Mangalam Srinu First Look Released
 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 17న పుష్ప పార్ట్ 1 రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుండి ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజై సూపర్ హిట్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా సినిమాలో నటిస్తున్న హీరో కం కమెడియన్ సునీల్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.

పుష్ప సినిమాలో సునీల్ మంగళం శ్రీను పాత్రలో నటిస్తున్నాడు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సునీల్ లుక్ అదిరిపోయిందని చెప్పాలి. సినిమాలో మళయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ఆది పినిశెట్టి కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. స్టార్ కమెడియన్ క్రేజ్ తో హీరోగా మారి ఆ ప్రయత్నాలు విరమించుకుని ఈసారి విలన్ గా మారి ప్రయత్నాలు చేస్తున్న సునీల్ కు పుష్ప మరో లెవల్ కు తీసుకెళ్లాలని ఆశిద్దాం.

- Advertisement -

ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నా పుష్ప సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా అంచనాలను మించి అనిపించేలా చేస్తాడని తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All