Homeటాప్ స్టోరీస్యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ

యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ

యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ
యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ

మ‌ల‌యాళ యంగ్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ విభిన్న‌మైన చిత్రాల‌తో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఓకే బంగారం, మ‌హాన‌టి చిత్రాల‌తో తెలుగులో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న దుల్క‌ర్ తెలుగులో మ‌రో చిత్రాన్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్నా సినిమా బ్యాన‌ర్‌పై ప్రియాంక ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1964 నేప‌థ్యంలో సాగే పిరియాడిక్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా వుంబోతోంది. వార్ నేప‌థ్యంలో సినిమా సాగుతుంద‌ని తెలుస్తోంది. దుల్క‌ర్ స‌ల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం మంగ‌ళ‌వారం రిలీజ్ చేసింది. ఇందులో దుల్క‌ర్ స‌ల్మాన్ లెఫ్టినెంట్ రామ్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇంకా టైటిల్ ఫైన‌ల్ కాని ఈ చిత్రానికి `యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ‌` అనే ట్యాగ్ లైన్‌ని పెట్టారు.

- Advertisement -

విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కించనున్నార‌ని తెలుస్తోంది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈ మూవీ ఇప్ప‌ట్లో వుండే అవ‌కాశం లేద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఆ వార్త‌ల‌కు చెక్ పెడుతూ చిత్ర బృందం దుల్క‌ర్ స‌ల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All