Homeగాసిప్స్మ‌ల‌యాళ హీరోతో హ‌ను రాఘ‌వ‌పూడి!

మ‌ల‌యాళ హీరోతో హ‌ను రాఘ‌వ‌పూడి!

మ‌ల‌యాళ హీరోతో హ‌ను రాఘ‌వ‌పూడి!
మ‌ల‌యాళ హీరోతో హ‌ను రాఘ‌వ‌పూడి!

`అందాల రాక్ష‌సి` చిత్రంతో విభిన్న‌మైన చిత్రాల త‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు హ‌ను రాఘ‌వ‌పూడి. తొలి సినిమా ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేక‌పోయినా ద‌ర్శ‌కుడిగా మాత్రం హ‌నుకు మంచి పేరును తెచ్చిపెట్టింది. రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుడు ప్ర‌సంశించేలా చేసింది. `కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌` త‌రువాత ఆయ‌న చేసిన `లై`, ప‌డి ప‌డి లేచె మ‌న‌సు ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయాయి.

ప్ర‌స్తుతం కొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని ప్లాన్ చేస్తున్నారు హ‌ను రాఘ‌వ‌పూడి. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా బ్యాన‌ర్‌పై సి. అశ్వ‌నీద‌త్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రియాంక ద‌త్ నిర్మించ‌బోతున్నారు. ఇందులో మ‌ల‌యాళ హీరో, యంగ్ సెన్సేష‌న్ దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్‌ని నిర్మాత అశ్వ‌నిద‌త్ వెల్ల‌డించారు.

- Advertisement -

గ‌త కొంత కాలంగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో హ‌ను రాఘ‌వ‌పూడి సినిమా చేస్తారంటూ వార్త‌లు వినిపించాయి. కానీ అందులో ఎంత మాత్రం నిజం వుంది?. ఇంత‌కీ ఈ ప్రాజెక్ట్ వుంటుందా? అన్న విష‌యాల్ని మాత్రం ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కానీ, దుల్క‌ర్ స‌ల్మాన్‌కానీ వెల్ల‌డించ‌లేదు. తాజాగా నిర్మాత అశ్వ‌నీద‌త్ వెల్ల‌డించ‌డంతో ఈ సినిమా ఎలా వుంటుంది? హ‌ను ఎలాంటి క‌థ‌తో దుల్క‌ర్‌ని చూపించ‌బోతున్నాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All