Homeగాసిప్స్సైరా పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సీనియర్ నటుడు

సైరా పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సీనియర్ నటుడు

సైరా పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సీనియర్ నటుడు
సైరా పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సీనియర్ నటుడు

సీనియర్ నటుడు గిరిబాబు ఎన్నో విలక్షణమైన పాత్రలతో, అటు విలన్ గా, ఇటు కమెడియన్ గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసాడు. ప్రస్తుతం అతని కొడుకు రఘుబాబు ఇండస్ట్రీలో క్యారెక్టర్ నటుడిగా ఫుల్ బిజీగా ఉంటోన్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే గతంలో గిరిబాబు చిరంజీవికి వ్యతిరేకంగా కొన్ని ఇంటర్వ్యూలలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తన కొడుకు బోసు బాబు సినిమా విషయంలో చిరంజీవి అండ్ కో కావాలనే తొక్కేశారని, అందువల్లే తన కొడుకు సినిమా ఆడకుండా పోయిందని, కెరీర్ కూడా నాశనమైందని వాపోయాడు. ఇదిలా ఉంటే ఇటీవలే మరో ఇంటర్వ్యూలో గిరి బాబు సైరా సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక ఇంటర్వ్యూలో మీరు ఒక్కోసారి చిరంజీవిని ప్రశంసిస్తారు, కష్టపడి పైకొచ్చిన వ్యక్తిగా గుర్తిస్తారు, మరేందుకు కొన్నిసార్లు విమర్శిస్తారు. అసలెందుకిలా అని ప్రశ్నించగా దానికి గిరిబాబు ఆసక్తికర సమాధానం చెప్పాడు.

గిరిబాబు మాట్లాడుతూ తన చిరంజీవితో విబేధాలు ఏం లేవని, ఆయనతో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, చిరంజీవితో నేను ఎన్నో సినిమాల్లో కలిసి నటించాను. తనతో నాకెందుకు ఇబ్బందులు ఉంటాయి. నిజానికి నేను చిరంజీవిని చాలా అభిమానిస్తాను. అతను చాలా మంచి వ్యక్తి. నాతో ఎప్పుడూ బాగుంటాడు, నన్ను ఆత్మీయంగా పలకరిస్తాడు. నేను చిరంజీవిని ఎప్పుడూ విమర్శించలేదు. ఒకానొక సందర్భంలో తన కొడుకు బోసుబాబు సినిమా విషయంలో చిరంజీవి నిర్మాతలు చేసిన పనిని విమర్శించాను. నేను అప్పుడు అన్నది చిరంజీవి నిర్మాతలను,చిరంజీవిని కాదు అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

అలాగే సైరా సినిమా గురించి కూడా స్పందించాడు గిరిబాబు. తాను సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చూశానని, చిరంజీవి చాలా అద్భుతంగా నటించాడని చెప్పాడు. ఆ విషయం చిరంజీవికి కూడా చెప్పా. సినిమా అద్భుతంగా తీశావని అభినందించా.అయితే ఈ సినిమా ఎక్కువ ఆడకపోవచ్చని కూడా అన్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చే 75 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆ వేడి లేదు. అప్పట్లో కాబట్టి అల్లూరి సీతారామరాజు సినిమా చూసారు, ఇప్పుడు చూడరు. ఇప్పుడు అందరికీ బాహుబలి వంటి సినిమాలు కావాలి. లేదా పాక్ కు వ్యతిరేకంగా సినిమా తీయాలి. ఫైట్లు, డ్యాన్సులు వంటివి ఉన్నా ఇష్టపడతారు. స్వతంత్రం రావడానికి 200 ఏళ్ల క్రితం నాటి కథను ఎక్కువ మంది ఆదరించకపోవచ్చని అభిప్రాయపడ్డాను.

నిజానికి సైరా నరసింహారెడ్డికి టాక్ బ్రహ్మాండంగా వచ్చింది, రివ్యూలు, మౌత్ టాక్ కూడా ఇదొక మంచి సినిమా అని పొగిడేశారు. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం సైరా నరసింహారెడ్డి ఫెయిల్ అయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అధిక రేటు కారణంగా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. తెలుగులో నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసి తన పేరిట రాసుకుంది. అయినా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిల్చింది. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All