Homeటాప్ స్టోరీస్నటుడు గిరిబాబు ఇంట విషాదం

నటుడు గిరిబాబు ఇంట విషాదం

Giribabu father erram nagayya passed awayసీనియర్ నటుడు గిరిబాబు ఇంట విషాదం నెలకొంది . గిరిబాబు తండ్రి ఎర్రం నాగయ్య (108) నిన్న మధ్యాహ్నం ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో తుది శ్వాస విడిచాడు . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఎర్రం నాగయ్య నిన్న కన్నుమూసాడు . తండ్రి మరణంతో గిరిబాబు ఇంట విషాదం నెలకొంది . స్వగ్రామంలోనే తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు . గిరిబాబు నటుడిగా , నిర్మాతగా , దర్శకుడిగా రాణించాడు . గిరిబాబు కు ఇద్దరు కొడుకులు కాగా పెద్ద కొడుకు రఘుబాబు కమెడియన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే .

గిరిబాబు ని నటుడిగా ప్రోత్సహించి సినిమాలకు పంపించాడు ఎర్రం నాగయ్య . తండ్రి ప్రోత్సాహంతోనే నటుడిగా విజయాలు అందుకున్నాడు గిరిబాబు దాంతో స్వగ్రమమలో పలు సేవా కార్యక్రమాలను తండ్రి సహాయంతోనే చేసాడు గిరిబాబు . 80 వ దశకంలో గిరిబాబు పలు సంచలనాత్మక చిత్రాల్లో నటించాడు , హీరోగా కూడా నటించాడు . విలన్ పాత్రలకు అప్పట్లో పెట్టింది పేరు గిరిబాబు . ఎర్రం నాగయ్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు గిరిబాబుకు సంతాపాన్ని తెలియజేసారు .

- Advertisement -

English Title: Giribabu father erram nagayya passed away

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All