Homeటాప్ స్టోరీస్దీపావళికి రానున్న గని

దీపావళికి రానున్న గని

దీపావళికి రానున్న గని
దీపావళికి రానున్న గని

యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ తన కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ వరుణ్ తేజ్ తన కెరీర్ గ్రాఫ్ ను పెంచుకుంటున్నాడు. వరుణ్ ప్రస్తుతం బాక్సర్ గా మారి చేస్తోన్న సినిమా గని. ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం గని చిత్ర విడుదలపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

దీపావళికి గని విడుదలవుతుందని అధికారికంగా తెలిపారు. ఇటీవలే మళ్ళీ తెలుగు సినిమా నిర్మాతలు వరసగా రిలీజ్ డేట్స్ తో వస్తున్నారు. ఒక సినిమా తర్వాత మరొకటి రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే గని విడుదల తేదీ కూడా వచ్చింది. అయితే ఇంకా థియేటర్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వకపోవడం, కరోనా పరిస్థితిపై అనిశ్చితి అలాగే ఉండడంతో ఈ రిలీజ్ డేట్స్ ఎంతవరకూ ఆధారితం అనేది తెలియదు.

- Advertisement -

కిరణ్ కొర్రపాటి గని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సాయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All