Homeటాప్ స్టోరీస్ఓవర్సీస్ లో వసూళ్ల దుమ్ము దులిపేస్తున్న దేవరకొండ

ఓవర్సీస్ లో వసూళ్ల దుమ్ము దులిపేస్తున్న దేవరకొండ

geetha govindam joins 2 million club in overseasవిజయ్ దేవరకొండ ఓవర్ సీస్ లో వసూళ్ల దుమ్ము దులిపేస్తున్నాడు . 2 మిలియన్ డాలర్లు సాధించడం అగ్ర హీరోలకు సైతం కష్టమవుతున్న ఈరోజుల్లో ఇతగాడు మాత్రం అవలీలగా 2 మిలియన్ డాలర్ల ని దాటేసి ట్రేడ్ విశ్లేషకులతో పాటుగా టాలీవుడ్ టాప్ స్టార్స్ ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది విజయ్ దేవరకొండ దూకుడు . ఆగస్టు 15న విడుదలైన గీత గోవిందం చిత్రానికి ప్రారంభం నుండే సూపర్ హిట్ టాక్ రావడంతో భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి . 12 రోజులకు గాను ఓవర్ సీస్ లో దాదాపు 13 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించాడు విజయ్ దేవరకొండ .

పలువురు అగ్ర హీరోలకు సైతం ఈ వసూళ్లు రావడం లేదు , కానీ విజయ్ దేవరకొండ మాత్రం తక్కువ సమయంలోనే పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో పాటుగా గీత గోవిందం తో ఓవర్ సీస్ లో స్ట్రాంగ్ మార్కెట్ ని ఏర్పరచుకున్నాడు . ఓవర్ సీస్ లో ఇంకా సరైన సినిమా ఏది లేదు అలాగే వసూళ్ల జోరు కూడా బాగానే ఉంది దాంతో రెండున్నర మిలియన్ డాలర్ల ని దాటడం ఖాయమని అంటున్నారు .

- Advertisement -

English Title: geetha govindam joins 2 million club in overseas

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All