Homeటాప్ స్టోరీస్రికార్డ్ బ్రేక్ : వంద కోట్ల క్లబ్ లో గీత గోవిందం

రికార్డ్ బ్రేక్ : వంద కోట్ల క్లబ్ లో గీత గోవిందం

geetha govindam joins 100 crores clubగీత గోవిందం చిత్రంతో చరిత్ర సృష్టించాడు విజయ్ దేవరకొండ . గీత గోవిందం చిత్రం 12 రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి రికార్డ్ సృష్టించాడు . అగ్ర హీరోలకు సైతం ఈ స్థాయి వసూళ్లు సాధించడం కష్టమైపోతున్న ఈరోజుల్లో అవలీలగా వంద కోట్లను అది కూడా 12 రోజుల్లోనే సాధించడం విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ కి కారణం . ఆగస్టు 15న విడుదలైన గీత గోవిందం విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో బంపర్ హిట్ సాధించింది . భారీ వసూళ్ల ని సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది గీత గోవిందం చిత్రం .

తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 14 కోట్ల బడ్జెట్ తోనే రూపొందింది . తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్ర బయ్యర్లు విపరీతమైన లాభాలను పొందుతున్నారు . విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ ఈ స్థాయిదా ? అని అగ్ర హీరోలు సైతం షాక్ అవుతున్నారు . కథ గా చెప్పుకున్నా ఇది గొప్ప కథ ఏమి కాదు కానీ విజయ్ మేనియా ముందు రికార్డులన్నీ బ్రేక్ అవుతున్నాయి . స్టార్ హీరోలు సైతం ఈ స్థాయి వసూళ్ల ని అందుకోవడానికి చాలా కష్టాలు పడుతున్న ఈ రోజుల్లో విజయ్ అలవోకగా 102 కోట్ల గ్రాస్ ని సాధించాడు . ఈ జోరు చూస్తుంటే మరో వారం రోజుల పాటు వసూళ్ల వర్షం కురిసేలా ఉంది .

- Advertisement -

English Title: geetha govindam joins 100 crores club

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All