
సీనియర్ హారో డాక్టర్ రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం ఈనెల 28 న విడుదల అవుతున్న నేపథ్యంలో ఈరోజు హానెస్ట్ ట్రైలర్ విడుదల చేసారు కొద్దిసేపటి క్రితం . ఇప్పటికే ఫస్ట్ లుక్ , టీజర్ లతో సినిమాపై అంచనాలు పెంచగా తాజాగా రిలీజ్ అయిన హానెస్ట్ ట్రైలర్ కూడా చాలా బాగుంది . దాంతో తప్పకుండా సూపర్ హిట్ కొట్టబోతున్నాం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు కల్కి బృందం .
ఇక ఇదే వేదికపై హీరో డాక్టర్ రాజశేఖర్ గరుడ వేగ 2 అనౌన్స్ చేసాడు . త్వరలోనే గరుడ వేగ 2 సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిపాడు . ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గరుడ వేగ సూపర్ హిట్ కావడంతో రాజశేఖర్ లో మళ్ళీ ఉత్సాహం వచ్చింది . ఇక ఇప్పుడేమో కల్కి చిత్రానికి మంచి బిజినెస్ జరగడంతో గరుడ వేగ 2 కి రెడీ అవుతునాన్రు . కథ బాగా వచ్చిందట . ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది .