Homeగాసిప్స్గరుడవేగ డైరెక్టర్ తో రామ్ సినిమా

గరుడవేగ డైరెక్టర్ తో రామ్ సినిమా

hero-ram-next-movie-with-praveen-sattaruగరుడవేగ చిత్రంతో సంచలన విజయం అందుకోవడమే కాకుండా సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ కు కూడా ఓ హిట్ నిచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు . గుంటూరు టాకీస్ చిత్రంతో అడల్ట్ దర్శకుడు అన్న ముద్ర పడిన ఈ దర్శకుడు గరుడవేగ చిత్రంతో ఆ ముద్ర ని చెరిపేసుకున్నాడు . దాంతో ప్రవీణ్ సత్తారు కి గిరాకీ బాగానే ఏర్పడింది . పలువురు హీరోలు ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి పోటీపడుతున్నారు . ఇప్పటికే నితిన్ ప్రవీణ్ సత్తారు తో ఓ సినిమా చేయడానికి రెడీ అవగా తాజాగా రామ్ కూడా ఈ డైరెక్టర్ తో పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట .

ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు రామ్ , అది పూర్తయ్యాక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించనున్నాడు రామ్ . ప్రవీణ్ సత్తారు కూడా ఒకవైపు యంగ్ హీరోలతో సినిమాలు చేయడానికి సమాయత్తం అవుతూనే గుంటూరు టాకీస్ సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All