Homeటాప్ స్టోరీస్ఆసక్తిగా మారిన 4 చిత్రాల పోటీ.. పైచేయి ఎవరిది?

ఆసక్తిగా మారిన 4 చిత్రాల పోటీ.. పైచేయి ఎవరిది?

ఆసక్తిగా మారిన 4 చిత్రాల పోటీ.. పైచేయి ఎవరిది?
ఆసక్తిగా మారిన 4 చిత్రాల పోటీ.. పైచేయి ఎవరిది?

రెండు నెలల నుండీ బిక్కుబిక్కుమని బతికిన థియేటర్లు ఇప్పుడు కొత్త కొత్త సినిమాలతో సందడి చేస్తున్నాయి. గత వారం వెంకీ మామ హడావిడి మర్చిపోక ముందే, ఈసారి ఏకంగా నాలుగు చిత్రాలు థియేటర్లలో రచ్చ లేపడానికి సిద్ధమైన విషయం తెల్సిందే. సాధారణంగా ఒక సినిమాకు మరో సినిమాను పోటీగా దించడడానికి తెలుగులో పెద్దగా ఆసక్తి చూపించరు. బడా బడా స్టార్ల నుండి చిన్న రేంజ్ హీరోల వరకూ అందరూ పరిస్థితిని బట్టి తమ సినిమాల వాయిదా అనేది ఉంటుంది. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే తప్పితే ఒకేరోజు రెండు సినిమాలు విడుదల కావడం చాలా అరుదుగా జరుగుతుంది. సంక్రాంతి సీజన్ అయినా కూడా సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు ఒక రోజు విడుదల కావట్లేదు. ఒక రోజు గ్యాప్ తీసుకుని విడుదలలను షెడ్యూల్ చేసుకున్నాయి.

అయితే ఈరోజు అంటే డిసెంబర్ 20న ఏకంగా నాలుగు సినిమాలు విడుదల కావడం విశేషమే. ఈ నాలుగు చిత్రాలు క్రిస్మస్ వీకెండ్ ను క్యాష్ చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే, నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ దర్సకత్వంలో తెరకెక్కిన రూలర్, కార్తీ హీరోగా వచ్చిన దొంగ, సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన దబాంగ్ 3. మొదటి రెండు స్ట్రైట్ చిత్రాలైతే, చివరి రెండు డబ్బింగ్ చిత్రాలు. వీటిలో దేని క్రేజ్ దానికుంది. ప్రతిరోజూ పండగే క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని రూపొందింది. అలాగే రూలర్ పక్కా మాస్ ఎంటర్టైనర్. ఖైదీ హిట్ తర్వాత కార్తీ దొంగపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక సల్మాన్ ఖాన్ స్టామినా గురించి చెప్పేదేముంది.

- Advertisement -

అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే ఈ నాలుగింటిలో దేనికీ కూడా పూర్తి అడ్వాంటేజ్ రాలేదు. ఏ చిత్రం కూడా ఫుల్ పాజిటివ్ రిపోర్ట్స్ ను అందుకోలేదు. అయితే ఉన్నంతలో ప్రతిరోజూ పండగేకు కొంత ఎడ్జ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ నాలుగు చిత్రాల్లో ఏది సక్సెస్ఫుల్ అవుతుందో, హాలిడే మార్కెట్ ను ఏ చిత్రం అడ్వాంటేజ్ తీసుకుంటుందో తెలియాలంటే మరొక్క రోజు ఆగాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All