Thursday, August 11, 2022
Homeటాప్ స్టోరీస్రూలర్ మూవీ రివ్యూ

రూలర్ మూవీ రివ్యూ

రూలర్ మూవీ రివ్యూ
రూలర్ మూవీ రివ్యూ

మూవీ రివ్యూ: రూలర్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, భూమిక, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు
నిర్మాత: సి కళ్యాణ్
దర్శకత్వం: కెఎస్ రవికుమార్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
మ్యూజిక్: చిరంతన్ భట్
ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2019
రేటింగ్: 2.5/5

- Advertisement -

ఈ ఏడాది రెండు ప్లాపులతో డీలాపడ్డ నందమూరి అభిమానులకు బాలకృష్ణ రూలర్ అంటూ మరో సినిమాను అందించాడు. అయితే ట్రైలర్, ప్రోమోలు అన్నీ ఒక రెగ్యులర్ మాస్ మసాలా సినిమాను చూడబోతున్నామన్న భావనను కలిగించాయి. మరి సినిమా ఏ రేంజ్ లో ఉందో చూద్దాం.

కథ:
ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈవో అర్జున్ ప్రసాద్ (నందమూరి బాలకృష్ణ), జయసుధకు వారసుడు. కంపెనీ పనిమీద బ్యాంకాక్ వెళితే అక్కడ సోనాల్ చౌహన్ తారసపడుతుంది. మొదట ద్వేషించినా సోనాల్, అర్జున్ ప్రసాద్ కు పడిపోతుంది. వారి పెళ్లికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో, అర్జున్ ప్రసాద్ కు, భవానీ నాథ్ అనే వ్యక్తితో గొడవ జరుగుతుంది. అర్జున్ ప్రసాద్ మీద అటాక్ చేయిస్తాడు భవానీ. అక్కడ కొన్ని ఊహించని పరిణామాలు అర్జున్ కు ఎదురవుతాయి. అతణ్ణి అందరూ ధర్మ అని పిలవడం మొదలుపెడతారు. అసలు ఈ ధర్మ ఎవరు? ఎందుకు అర్జున్ ప్రసాద్ ను ధర్మ అంటున్నారు? అర్జున్ కు ఏమైనా గతముందా? వంటి విషయాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు:
ముందుగా నందమూరి బాలకృష్ణ గురించే ప్రస్తావించుకోవాలి. ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరించాడు. సినిమా అంతటా ఆయన చూపించిన ఎనర్జీకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అటు డ్యాన్సుల్లో కానీ ఇటు ఫైట్స్ లో కానీ బాలయ్య ఎక్కడా తగ్గలేదు. తనకలవాటైన రీతిలో చెలరేగిపోయాడు. అలాగే ఎమోషనల్ సీన్లలో కూడా మెప్పించాడు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సీఈవోగా బాలయ్య లుక్ అదిరిపోయింది. సోనాల్ చౌహాన్ గ్లామర్ పరంగా తనను తీసుకున్నందుకు పూర్తి న్యాయం చేసింది. ఆమె తన స్కిన్ షో తోనే జనాలను ఆకర్షిస్తుంది. పాత్ర పరంగా చెప్పుకోవడానికి ఏం లేదు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటించిన వేదిక ఆకట్టుకుంటుంది. అటు గ్లామరస్ గా ఉంటూనే, ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో మెప్పించింది. నాగినీడు, ప్రకాష్ రాజ్, జయసుధ తమకలావాటైన పాత్రలే కాబట్టి ఆకట్టుకుంటారు. భూమిక కూడా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది. సప్తగిరి, సాయాజీ షిండే, ధనరాజ్, శ్రీనివాస రెడ్డి వంటి వారు కామెడీ చేయడానికి బాగా కష్టపడ్డారు. మిగిలిన వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:
విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫైట్స్ కూడా ఒక స్థాయి వరకూ మెప్పిస్తాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. చిరంతన్ భట్ పాటలు, నేపధ్య సంగీతం మెప్పిస్తాయి. పరుచూరి మురళి ఈ సినిమాకు ముతక కథను అందించాడు. ఇప్పటికే వందల సినిమాల్లో ఈ టైపు కథలను చూసేసాం. సంభాషణలు మెప్పిస్తాయి. ముఖ్యంగా రైతుల కష్టాల మీద రాసిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడిగా కెఎస్ రవికుమార్ అవుట్ డేట్ అయ్యాడేమో అనిపిస్తుంది. మూస ఫార్మాట్ లోనే సినిమాను నడిపించాడు. కమర్షియల్ సినిమా అనగానే పాట, ఫైటు అన్న తరహాలో ఉండాలని భావించి అదే వే లో సినిమాను తీసుకెళ్లారు.

చివరిగా:
రూలర్ ఆశించినట్లుగానే రొటీన్ గానే ఉంది. ట్రైలర్ లో చూస్తేనే కథ మీద ఒక అంచనాకు రావొచ్చు. అంతకు మించి ఈ కథలో ఏం లేదు. అయితే బాలయ్య ఈ సినిమాను లేపడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ధర్మగా బాలయ్య అదరగొడతాడు, అయితే ఆ పాత్ర లుక్ విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో అర్ధం కాదు. మొత్తంగా రూలర్ బాలయ్య అభిమానులకు నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫైట్లు, గ్లామర్ విందు పుష్కలంగా ఉన్న ఈ చిత్రం బి, సి సెంటర్ ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు ఉన్నాయి. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ కాగల ఈ చిత్రం ఒక సగటు మాస్ మసాలా సినిమాగా మిగిలిపోతుంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts