Homeటాప్ స్టోరీస్జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డికి ప్ర‌ముఖుల నివాళి

జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డికి ప్ర‌ముఖుల నివాళి

జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డికి ప్ర‌ముఖుల నివాళి
జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డికి ప్ర‌ముఖుల నివాళి

గుంటూరులో రంగ‌స్థ‌ల న‌టుడిగా కెరీర్ ప్రారంభించి `బ్ర‌హ్మ పుత్రుడు` చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన విల‌క్ష‌ణ న‌టులు జయ‌ప్ర‌కాష్‌రెడ్డి సోమ‌వారం ఉద‌యం గుండె పోటుతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆక‌స్మిక మృతితో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం ప‌ట్ల టాలీవుడ్ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నేత‌లు, నాట‌క‌రంగ క‌ళాకారులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.

మ‌హేష్‌బాబు ట్విట్ట‌ర్ వేదిక సంతాపం వ్య‌క్తం చేశారు. జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి మృతి త‌న‌ని క‌ల‌చివేసింద‌ని, టాలీవుడ్‌లో వున్న అత్యుత్త‌మ న‌టుడు, క‌మెడియ‌న్స్‌ల‌లో ఒక‌రాయ‌న అన్నారు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ఉల్లాసంగా ఉత్సాహంగా వుండేద‌ని, ఈ సంద‌ర్భంగా ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి మ‌ర‌ణ వార్త విని షాక‌య్యాను. నేను ఆయ‌న‌ను ప్రేమ‌గా మామ అని పిలుస్తుంటాను. ఆయ‌న మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని న‌ష్టం అని ర‌వితేజ అన్నారు. జ‌య ప్ర‌కాష్‌రెడ్డిగారు మీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను. షూటింగ్ స‌మ‌యంలో మీతో వున్న స‌మ‌యం అద్భుతం` అని జెనీలియా ట్వీట్ చేశారు. ఎన్నో మంచి పాత్ర‌ల‌తో మెప్పించిన జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి మ‌ర‌ణం విచార‌క‌రం, ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అని బాల‌కృష్ణ అన్నారు. నా స్నేహితుడు జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి మ‌ర‌ణం త‌న‌ని క‌ల‌చి వేసింద‌ని, ఆయ‌న‌తో కాంబినేష‌న్ ఎంతో గొప్ప‌గా వుండేద‌ని వెంక‌టేష్ గుర్తు చేసుకున్నారు. ప్ర‌కాష్ రాజ్ నుంచి శ్రీ‌ముఖి వ‌ర‌కు ఇండ‌స్ట్రీకి చెందిన వారంతా జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All