
టాలీవుడ్‌లో విషాదం. ప్రముఖ రంగస్థల నటుడు, సీనియర్ సినీ నటుడు జయప్రకాష్‌రెడ్డి (73) మృతి చెందారు. గుండెపోటు రావడంతో బాత్రూమ్‌లోనే కుప్పకూలారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు దృవీకరించారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో గత కొంత కాలంగా గుంటూరులో ఆయన వుంటున్నారు. స్వగృహంలో మంగళవారం ఉదయం ఆయన కన్ను మూశారు.
జయప్రకాష్‌రెడ్డి సొంతూరు కడప జిల్లాలోని ఆళ్లగడ్డ మండలంలోని సిరివెల్ల. 1946 మే 8న జన్మించిన జయప్రకాష్‌రెడ్డి `బ్రహ్మపుత్రుడు` చిత్రంతో సినిమాల్లోకి ప్రవేశించారు. దాదాపు వందకు పైగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు. పలు చిత్రాల్లో ప్రతి నాయకుడిగా, హాస్య నటుడిగా రాయలసీమ యాసలో తనదైన ముద్ర వేశారు.
ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవరెడ్డి, పల్నాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్, గబ్బర్‌సింగ్, నాయక్, బాద్‌షా, రేసుగుర్రం, మనం, పటాస్, టెంపర్, సనైనోడు, ఖైదీ నంబర్ 150, జై సింహా, సుప్రీమ్, రాజా దిగ్రేట్ తదితర చిత్రాల్లో నటించారు. జయప్రకాష్‌రెడ్డి హఠాన్మరణం పట్ల పలువురు సినీ, నాటకరంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.