Homeటాప్ స్టోరీస్లాంగ్ షెడ్యూల్ ను మొదలుపెట్టిన ఎఫ్3

లాంగ్ షెడ్యూల్ ను మొదలుపెట్టిన ఎఫ్3

లాంగ్ షెడ్యూల్ ను మొదలుపెట్టిన ఎఫ్3
లాంగ్ షెడ్యూల్ ను మొదలుపెట్టిన ఎఫ్3

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా చేసిన ఎఫ్2 చిత్రం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం దీని సీక్వెల్ ఎఫ్3 షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం మరింత ఫన్ తో ఉంటుందని నిర్మాతలు, దర్శకుడు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తమన్నా, మెహ్రీన్ లు ఈ సినిమాలో కూడా హీరోయిన్లుగా కంటిన్యూ అవుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఎఫ్3 లాంగ్ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా ఈ లాంగ్ షెడ్యూల్ తో మెజారిటీ షూటింగ్ ను పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

- Advertisement -

డిసెంబర్ కల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు. ఒకవేళ సంక్రాంతి రేసు నుండి పెద్ద సినిమాలు ఏమైనా వెనక్కి తగ్గితే ఎఫ్3ను రేసులో నిలబెట్టాలని భావిస్తున్నాడు. ఇందుకోసమే ఎఫ్3 షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేయబోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All