Homeటాప్ స్టోరీస్త‌ప్పుడు వార్త‌ల్ని న‌మ్మ‌కండి - భార‌తీరాజా

త‌ప్పుడు వార్త‌ల్ని న‌మ్మ‌కండి – భార‌తీరాజా

త‌ప్పుడు వార్త‌ల్ని న‌మ్మ‌కండి - భార‌తీరాజా
త‌ప్పుడు వార్త‌ల్ని న‌మ్మ‌కండి – భార‌తీరాజా

త‌మిళ సీనియ‌ర్ దర్శ‌కుడు భార‌తీరాజాకు ఏమైంది?. ఆయ‌న‌ని ముంబైలోని థానే పోలీసులు క్వారెంటైన్‌కు  ఆయ‌న‌ను త‌ర‌లించాంటూ వ‌రుస క‌థ‌నాలు త‌మిళ మీడియాలో ఎందుకు మొద‌ల‌య్యాయి?. ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు భార‌తీరాజా చెన్నై నుంచి ముబైలోరని థానేకు వెళ్లారు. అయితే ఆయ‌న‌ను అక్క‌డి పోలీసులు క్వారెంటైన్‌కు పంపించారంటూ త‌మిళ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి. దీనిపై భార‌తీరాజా స్పందించారు.

తాను ఆరోగ్యంగానే వున్నాన‌ని, త‌న‌ని క్వారెంటైన్‌కు త‌ర‌లించ‌లేద‌ని భార‌తీరాజా స్ప‌ష్టం చేశారు. థానేలో వున్న నా సహోద‌రికి శ‌స్త్ర చికిత్స జ‌ర‌గ‌డంతో ఆమెని చూడ‌టం కోసం థానే వెళ్లాను. పోలీసుల నుంచి పాస్ తీసుకుని బ‌య‌లు దేరా. అంత‌కు ముందు చెన్నైలో టెస్టులు కూడా చేయించుకున్నా నెగెటివ్ వ‌చ్చింది. థానే వెళ్లాక స్థానిక అధికారుల‌కు నేనే విష‌యాన్ని చెప్పా. అక్క‌డ కూడా నాకు ప‌రీక్ష‌లు జ‌రిగాయి.

- Advertisement -

మార్గ మ‌ధ్య‌లో కూడా ప‌రీక్ష‌లు చేశారు. మొత్తం మూడు చోట్ల నెగెటివ్ వ‌చ్చింది. ప‌లు జిల్లాలు దాటి వ‌చ్చ‌నందువ‌ల్లే  నేను స్వ‌చ్ఛందంగా ప‌రీక్ష‌లు చేయించుకున్నా. ఆసుప‌త్రిలో మా సోద‌రిని చూసొచ్చిన త‌రువాత ఇంటికొచ్చాం. నేను ఆరోగ్యంగానే వున్నాను. వ‌దంతులు, త‌ప్పుడు వార్త‌ల్ని న‌మ్మ‌కండి` అని భార‌తీరాజా విజ్ఞ‌ప్తి చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All