Homeటాప్ స్టోరీస్డాక్ట‌ర్‌ని పెళ్లాడుతున్న క్రేజీ డైరెక్ట‌ర్‌!

డాక్ట‌ర్‌ని పెళ్లాడుతున్న క్రేజీ డైరెక్ట‌ర్‌!

డాక్ట‌ర్‌ని పెళ్లాడుతున్న క్రేజీ డైరెక్ట‌ర్‌!
డాక్ట‌ర్‌ని పెళ్లాడుతున్న క్రేజీ డైరెక్ట‌ర్‌!

టాలీవుడ్‌లో వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా  పెళ్లి వార్త‌లు వినిపిస్తూ వ‌రుస‌గా షాకుల‌మీద షాకులిస్తున్నారు. నితిన్ ఇప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ ని పూర్తి చేసుకుని  పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాడు. నిఖిల్ ఇప్ప‌టికే పెళ్లి చేసుకున్నాడు కూడా. ఎంతో కాలంగా పెళ్లి పేరెత్తితేనే త‌ప్పించుకు తిరిగిన రానా తాజాగా మిహీకా బ‌జాజ్‌ని పెళ్లాడ‌బోతున్నాడు. ఇటీవ‌లే రోకా ఫంక్ష‌న్ కూడా పూర్తియింది.

ఆగ‌స్టు 8న పెళ్లికి ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. ఆగ‌స్టు 6 నుంచి 8 వ‌ర‌కు మూడు రోజుల పాటు గ్రాండ్‌గా వివాహ వేడుక‌ని జ‌ర‌పాల‌ని ఇప్ప‌టికే ప్లాన్ ఏ, ప్లాన్ బిని రెడీ చేశారు. ఇదిలా వుంటే మ‌రో యంగ్ టాలెంటెడ్ కూడా పెళ్లికి రెడీ అయిపోతున్నాడు. అయితే ఈ యంగ్ టాలెంటెడ్ హీరో కాదు యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్‌. ఆయ‌న వివాహం హైద‌రాబాద్‌కు చెందిన డెంట‌ల్ డాక్ట‌ర్ ప్ర‌వ‌ల్లిక‌తో జ‌రగ‌బోతోంది. ‌వ‌చ్చే వార‌మే వీరి ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుంది.

- Advertisement -

`ర‌న్ రాజా ర‌న్‌` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన సుజీత్ `సాహో`తో టాప్ డైరెక్ట‌ర్‌ల లిస్ట్‌లో చేరిపోయాడు. మూడ‌వ సినిమాకే మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే బంప‌ర్ ఆఫ‌ర్‌ని సొంతం చేసుకున్నాడు.  మ‌ల‌యాళ హిట్ చిత్రం `లూసీఫ‌ర్‌`ని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All