Homeగాసిప్స్నితిన్ సినిమాకు లిప్‌లాక్ చిక్కు!

నితిన్ సినిమాకు లిప్‌లాక్ చిక్కు!

నితిన్ సినిమాకు లిప్‌లాక్ చిక్కు!
నితిన్ సినిమాకు లిప్‌లాక్ చిక్కు!

బాలీవుడ్ హిట్ చిత్రం `అంధాధూన్‌`. ఆయుష్మాన్ ఖురానా హీరోగా అంథుడి పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్త‌మ పుర‌స్కారాన్ని తెచ్చిపెట్టింది. ఈ  చిత్ర తెలుగు రీమేక్ హ‌క్కుల్ని హీరో నితిన్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌బోతున్నారు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

ఈ చిత్రం కోసం నానికి జోడీగా ముందు కీర్తి సురేష్‌ని సంప్ర‌దించార‌ట‌. అయితే ఇందులో హీరోయి హీరోయిన్‌ల మ‌ధ్య లిప్ లాక్ సీన్ వుంది. ఆ సీన్ చేయ‌డానికి కీర్తిసురేష్ ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌. దాంతో ఆమె ఈ చిత్రాన్ని తిర‌స్క‌రించిన‌ట్టు తెలిసింది. ఆ త‌రువాత `నాని గ్యాంగ్ లీడ‌ర్‌` చిత్రం ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన చెన్నై చిన్న‌ది ప్రియాంక అరుళ్ మోహ‌న్ ని సంప్ర‌దించార‌ట‌. లిప్ లాక్ కార‌ణంగా త‌ను కూడా నితిన్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన‌ట్టు తెలిసింది.

- Advertisement -

దీంతో మ‌రో హీరోయిన్‌ని ఈ చిత్రం కోసం వెతుకుతున్నారు. `అంధాధూన్‌`లో హీరోయిన్‌గా రాధికా ఆప్టే, కీల‌క పాత్ర‌లో టాబు న‌టించారు. శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ తెర‌కెక్కించారు. జాతీయ పుర‌స్కారాల్లో ఉత్త‌మ హిందీ చిత్రంగా, ఉత్త‌మ అడ‌ప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంతో పాటు ఉత్త‌మ న‌టుడు విభాగంలోనూ అవార్డుల్ని అందించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All