Homeటాప్ స్టోరీస్సినిమాలో వున్న ఎమోషన్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు .. దర్శకుడు రాహుల్ రవీంద్రన

సినిమాలో వున్న ఎమోషన్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు .. దర్శకుడు రాహుల్ రవీంద్రన

Director Rahul Ravindran Interview
Director Rahul Ravindran Interview

అందాల రాక్షసి చిత్రంతో వన్ ఆఫ్ ది హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్ తన ఫస్ట్ సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పెళ్లి పుస్తకం, గాలిపటం, అలా ఎలా?, టైగర్, హైదరాబాద్ లవ్ స్టోరీ, హౌరా బ్రిడ్జ్, వంటి హిట్
సినిమాలు చేసారు.

హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే ఆయన చూపు దర్శకత్వం వైపు మళ్లింది. సుశాంత్ హీరోగా చి ల సౌ చిత్రాన్ని తెరకెక్కించారు రాహుల్. ఆ చిత్రం సక్సెస్ కావడంతో రాహుల్ కి అన్నపూర్ణ లాంటి పెద్ద సంస్థ నుండి ఆఫర్ వచ్చింది.
కింగ్ నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన మన్మధుడు-2 చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహించారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాల‌పై అక్కినేని నాగార్జున, పి .కిరణ్ ఈ చిత్రాన్నినిర్మించారు. ఆగ‌స్ట్ 9న సినిమా విడుద‌ల‌వుతోన్న సందర్బంగా ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌ మీడియాతో ముచ్చటించారు.

- Advertisement -

ఫ్రెంచ్ సినిమా రీమేక్ చేయడానికి కారణం?

* ఫ్రెంచ్ సినిమాను రీమేక్ చేయాల‌ని నాగార్జున‌గారు చెప్పగానే నాకు భ‌యం వేయ‌లేదు.. అయితే రైట్స్ ఉన్నాయి క‌దా సార్‌! అన్నాను. ఆయ‌న అఫీషియ‌ల్‌గా రైట్స్ తీసుకున్నామ‌ని చెప్పారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్ల‌డంతో
స‌మయం ప్ర‌కారం అంతా ముగిసింది.

మన్మధుడు-2 టైటిల్ పెట్టాలనే ఆలోచన ఎవరిది?

*ఈ టైటిల్‌ను ఎవ‌రు చెప్పారో తెలియ‌దు కానీ మా టీమ్ స‌భ్యులే చెప్పారు. క‌థ‌కు త‌గ్గ టైటిల్‌. మ‌న్మ‌థుడు అనే టైటిల్‌ను పెడితే రెండు సినిమాలు ఒకే హీరో చేశాడు కాబ‌ట్టి రేపు ఎప్పుడైనా ప్రేక్ష‌కులు క‌న్‌ఫ్యూజ్ అయ్యే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి
మ‌న్మ‌థుడు 2 అని పెట్టాం. సినిమాలో మంచి ఎమోష‌న్ ఉంది. దానికి ఆడియెన్స్ ఎక్క‌డో క‌నెక్ట్ అవుతార‌ని గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది.

సమంత చిన్నపాత్రలో నటించిందని తెలిసింది.. ఎలా కన్వినెన్స్ చేసారు?

*అవునండి. సినిమాలో స‌మంత ఓ సీన్‌లో న‌టించారు. ఆ సీన్ మైండ్‌లోకి రాగానే ముందునాకు త‌ట్టిన యాక్ట‌ర్ స‌మంత‌నే. నాకు అనిపించిన త‌ర్వాత త‌న‌కు చెప్పాను ఓకే అంది. ఆ త‌ర్వాత నాగ్ సార్‌కి చెప్పాను ఆయ‌న ఓకే చాలా బావుంది బ‌ట్
స‌మంత చేస్తుందా? అని అడిగారు. ఆమెకు చెప్పాన‌ని, ఆమె చేయ‌డానికి ఒప్పుకుంద‌ని నాగ్‌సార్‌కి చెప్ప‌గానే అయితే ఓకే అన్నారు.

ఈ అవకాశం ఎలా వచ్చింది?

* నేను సినిమా చేస్తే బావుంటుంద‌ని గీత‌ గారు చెప్పారు. `చి.ల‌.సౌ` సినిమా చూసి నాగార్జున‌గారు పిలిచి అవ‌కాశం ఇచ్చారు. `ఒక‌సారి ఫ్రెంచ్ సినిమా చూడు నీకు న‌చ్చితే చేద్దాం` అని నాగ్‌ సార్‌ అన్నారు. వెంట‌నే నేను చాలా హ్యాపీ ఫీల‌య్యాను. నా
రెండో సినిమానే నాగ్ హీరో అంటే అమేజింగ్ ఫీలింగ్ అనిపించింది. ఇది చాలా హ్యాపీ సినిమా ఫుల్ ఎంట‌ర్‌టైన్ మూవీ.

డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయని..?

* ఇందులో ఏ ఒక్క సీన్ కూడా అస‌భ్య‌క‌రంగా ఉండ‌దు. అలా చూపించి టికెట్ అమ్మాల‌నే ఆలోచ‌న లేదు. అలాగే ఇందులో రాసిన ప్ర‌తీ డైలాగ్ సింగిల్ మీనింగ్‌తోనే రాశాం. ఎక్క‌డా డ‌బుల్ మీనింగ్ ఉండ‌దు. కాక‌పోతే ఎందువ‌ల్ల‌నో ఫీడ్ బ్యాక్ అలా
వ‌చ్చింది. ఇందులో డైలాగ్స్ అనేవి వ‌ల్గ‌ర్‌గా ఉండ‌వు నాటీగా మాత్ర‌మే అనిపిస్తాయి. మ‌న‌కు కేవ‌లం మ‌నం ఆలోచించే విధానాన్ని బ‌ట్టి ఉంటుంది. మేం సింగిల్ మీనింగ్‌లో రాసినా.. ఓ సంద‌ర్భంలో డ‌బుల్ మీనింగ్ అన్న ఫీడ్ బ్యాక్‌వ‌చ్చింది. ఉదాహ‌ర‌ణ‌కి
`పిల్ల‌ల‌కి కోచింగ్ ఇచ్చే వ‌య‌సులో నువ్వు బ్యాటింగ్‌కి దిగుతావేంటిరా? అన్న డైలాగ్ బాగా డ‌బుల్ మీనింగ్ అన్నారు. కానీ రాసేట‌ప్పుడు మేమైతే ఆ ఉద్దేశం లేదు.

ఈ చిత్రంకోసం ఎక్కువ టైం తీసుకోవటానికి కారణం?

*ప్రీ ప్రొడ‌క్ష‌న్ కోసం 7 నెల‌లు ప‌ట్టింది. ఫైన‌ల్ క‌థ‌ను లాక్‌చెయ్య‌డం కోసం అలా టైమ్ తీసుకున్నా అంతే. క‌థ మొద‌ల‌య్యే ఒక నెల‌న్న‌ర ముందు క‌థ‌ను బ‌లంగా త‌యారు చేసి వెళ్ళాను. డైలాగ్ రైట‌ర్ కిట్టు కూడా యాడ్ అయ్యారు. షూట్
మొద‌ల‌యిందంటే ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతాయి. ప్రీ-ప్రొడ‌క్ష‌న్ మంచిగా తీసుకుంటే షూట్‌లో ఏ ప్రాబ్ల‌మ్ రాదు అని బాగా న‌మ్ముతాను. `చి.ల‌.సౌ` త‌ర్వాత చాలా ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. కానీ త‌ర్వాత నేను వెంట‌నే ఈ సినిమాకు లాక్ అయిపోయాను.

మ్యూజిక్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?

*మ్యూజిక్ డైరెక్ట‌ర్ చైత‌న్ భ‌రద్వాజ్ చాలా హార్డ్ వ‌ర్క‌ర్‌. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయ‌న మ్యూజిక్ చేసిన ఆర్‌.ఎక్స్ 100లో పిల్లారా సాంగ్‌ను బాగా విన్నాను. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎవ‌రిని తీసుకోవాల‌ని అనుకుంటున్న‌ప్పుడు నాగ్
సార్ చైత‌న్ పేరుని స‌జెస్ట్ చేశాడు. త‌న‌ను క‌లిసి మాట్లాడాను. అలా సెట్ అయ్యింది. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

* నాగ్‌గారి క్యారెక్ట‌ర్ ఏంటంటే ఆయ‌న‌కు రిలేష‌న్స్ మీద న‌మ‌మ‌కం ఉండ‌దు. ఆయ‌నకున్న రిక్వైర్ మెంట్స్ వేరు కానీ అమ్మాయిల‌కి మంచి రెస్‌పెక్ట్ ఇస్తారు. ప‌డ‌యేడం ఏంటి ముందు గౌర‌వం ఇస్తే వాళ్ళే వ‌స్తారు అనే ఓ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌తారాయ‌న‌.

మీ వైఫ్ చిన్మయికి గురించి?

* చిన్మ‌యికి నాకు మ‌ధ్య బాండింగ్ చాలా బావుంటుంది. త‌ను నాకు దొర‌క‌డం నా ల‌క్‌. త‌ను చాలా ఇండిపెండెంట్ గ‌ర్ల్‌. త‌న‌కు తెలుసు ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? అని నేను త‌న‌ను ప్ర‌త్యేకించి స‌పోర్ట్ చెయ్య‌డం అంటూ ఏమీ ఉండ‌దు ఎప్పుడు స‌పోర్ట్
చెయ్యాలో అప్పుడే చేస్తాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ హీరో రాహుల్ రవీంద్రన్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All