Homeటాప్ స్టోరీస్ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మన్మధుడు-2 అందరినీ అలరిస్తుంది- కింగ్ నాగార్జున

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మన్మధుడు-2 అందరినీ అలరిస్తుంది- కింగ్ నాగార్జున

Nagarjuna Latest Interview
Nagarjuna Latest Interview

కింగ్ నాగార్జున హీరోగా రకుల్ ప్రీత్ హీరోయిన్ గా చి:ల:సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మన్మథుడు2’. అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి వయాకామ్‌18, ఆనంది ఆర్ట్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.
సమంత, కీర్తి సురేష్ స్పెషల్ అప్పీరియన్స్ లో తళుక్కున మెరవనున్నారు. సీనియర్ నటి లక్ష్మి, జాన్సీ కళ్యాణి ప్రియదర్శిని ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ ను పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా
ఆగస్టు 9న అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా కింగ్ నాగార్జున మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు.. ఆ కార్యక్రంలో చిత్ర విశేషాలను వెల్లడించ్చారు..

*మన్మథుడు2’ రిలీజ్ అవుతుంది టెన్షన్ గా ఫీలవుతున్నారా ?
– బటర్‌ఫ్లైస్‌ ఇన ద స్టొమక్‌ అన్నట్టుంది నా ఫీలింగ్‌. చాలా బాగా హార్డ్‌ వర్క్‌ చేశాం. లక్షలాది మంది సినిమా చూసి జడ్జి చేస్తారు. అంతెందుకు జర్నలిస్టులు కూడా ప్రతిసారీ ఆర్టికల్‌ రాసినప్పుడు ఎవరైనా బావుందంటే బాగా అనిపిస్తుంది. ఎవరైనా
బాగోలేదని అన్నప్పుడు ఏదోలా అనిపిస్తుంది కదా. సినిమా కూడా అంతే.

- Advertisement -

* ఫ్రెంచ్ సినిమా కి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి.. ?
– అవును కానీ బేసిక్ లైన్ మాత్రమే తీసుకున్నాం. ఫుల్ ప్లెడ్జెడ్ గా తెలుగులో చాలా మార్పులు చేశాం. నా కెరీర్‌లో ఈ దశలో రొమాంటిక్‌ కామెడీలు నాకు నప్పవు అని అనుకుంటున్న సమయంలో నేను ఆ సినిమా చూశా. చూసీచూడగానే చాలా బాగా
నచ్చింది. టైలర్‌ మేడ్‌ అనిపించింది. ఫ్రెంచలో యాక్ట్‌ చేసిన అతను కూడా చాలా పాపులర్‌ అతను. ఆయన తన మిడిల్‌ ఏజ్‌లో ఉన్నాడు. దానికి తగ్గట్టు సినిమాలోనూ మిడిల్‌ ఏజ్డ్‌ బ్యాచలర్‌గా నటించాడు. సినిమా కూడా చాలా ఫన్నీగా అనిపించింది.
నిజంగా చెప్పాలంటే ఇది రొమాన్స గురించి కానీ, ప్రేమ గురించి కానీ కాదు. అంతకు మించి తన కుటుంబం కోసం అతను చేశాడు? వారి ప్రభావం అతనిపై ఎలా ఉంది? తల్లితో అతనికున్న బంధం ఎలాంటిది? వంటివన్నీ ఆసక్తికరం. అతనికి తల్లి అంటే
ఇష్టం. ఆమె ఏం చెప్పినా కాదనలేడు. అలాగని తన ఇష్టాలను దాచుకోలేడు. అలాంటి సమయంలో అతని జీవితంలోకి ఓ యువతి ప్రవేశిస్తే పరిస్థితి ఏంటనేది సినిమా.

* ఈ చిత్రంలో మీరు పెళ్లిని బరువుగా భావిస్తారా ?
– అలాంటిదేమీ కాదు. కానీ అతని జీవితంలో తల్లి, ముగ్గురు సిస్టర్స్‌ ఉన్నారు. వాళ్లు నలుగురూ అతన్ని నొక్కేసి, తొక్కేసి… (నవ్వుతూ) అలాంటి సమయంలో అతను మహిళలు తన జీవితంలో ఉండకుండా ఉంటే బావుంటుందని అనుకుంటాడు. ఆ
తరువాత రియలైజ్ అయి ఏం చేసాడు అనేది కథ. ఫుల్ ఎంటర్ టైనింగ్ వేలో చెప్పాం.

* పోర్చుగీస్‌ బ్యాక్‌డ్రాప్ లో ఈ సినిమా తీయడానికి రీజన్ ఏంటి?
– విజయనగరం నుంచి 1800సంవత్సరం చివరిలో కొందరిని అటు మారిషస్‌, ఇటు పోర్చుగల్‌.. ఇలా కొన్ని చోట్లకు తీసుకెళ్లారు. అప్పుడు లేబర్‌గా తీసుకెళ్లారన్నమాట. అలా వెళ్లిన వాళ్లల్లో పోర్చుగీస్‌లో నాలుగో తరం వాళ్లుగా మేం
నటించామన్నమాట. మామూలుగా అలా వెళ్లినప్పుడు బయటి నుంచి సపోర్టింగ్‌ సిస్టమ్‌ ఉండదు కాబట్టి, కుటంబంలో ఉన్న వ్యక్తుల మధ్య గట్టి బంధం ఉంటుంది. మామూలుగా ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మారిషస్‌ వెళ్లినా, ఫిజి ఐల్యాండ్స్‌
వెళ్లినా, అమెరికా వెళ్లినా, అక్కడ తరాల తరబడి సెటిల్‌ అయిన తెలుగు కుటుంబాలుంటాయి. వాళ్లు చాలా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతారు. ఇంగ్లిష్‌ పదాలు మధ్యలో రావు. ఈ సినిమాలో మేం మాట్లాడే మాటల్లోనూ ఆంగ్ల పదాలుండవు. అన్నీ
పోర్చుగీసు పదాలు మిక్స్‌ అయి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే పోర్చుగల్‌లో జనాభా తక్కువ. మేం షూటింగ్‌ చేసిన వీధుల్లో ఎలాంటి పర్మిషన్లు అక్కర్లేదు. చాలా సులువుగా చేశాం.

* వయసు మీద జోకులు వేయడం వంటివన్నీ ట్రైలర్ లో కనిపించాయి?
– అవునండీ. ఇంతకు ముందు వచ్చినా యంగర్‌ జనరేషన వాళ్లు పెళ్లి చేసుకోనని అనడం విని ఉంటారేమోగానీ, ఎక్కడా మిడిల్‌ ఏజ్‌ వాళ్ళని అనడం విని ఉండరు. కానీ ఈ సినిమా విషయంలో అది కుదిరింది.

*రాహుల్‌నిడైరెక్టర్ గా తీసుకోవడానికి కారణం ఏంటి?
– చి.ల.సౌ చూశా. చిన్న సినిమా. సెన్సిటివ్‌గా తీశాడు. అతనికి పెర్ఫార్మెన్స రాబట్టుకోవడం వచ్చు. ఈ సినిమాకు పెర్ఫార్మెన్సలు రాబట్టుకోవడం అవసరం. అందుకే తీసుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పగానే అతను హెసిటేట్‌
చేశాడు. కానీ సినిమా చూసిన తర్వాత వెంటనే ఓకే చేశాడు. కామెడీ చాలా బాగా చేశాడు. ఫ్యామిలీ ఎమోషన్సని కూడా చాలా బాగా డీల్‌ చేశాడు. ఆ సినిమా బేస్‌ లైన తీసుకుని చాలా చేంజ్‌ చేశాడు. ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన చేశాం. రాహుల్‌,
కెమెరామేన సుకుమార్‌ కలిసి చాలా బాగా చేశారు.

* వయాకామ్‌, ఆనంది ఆర్ట్స్‌తో సినిమా చేయడం గురించి?
– వయాకామ్‌ వాళ్లకి నాతో కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కుదిరింది. ఆనంది ఆర్ట్స్‌ కిరణ్‌ , నేనూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌. ఆయనికి ఎప్పుడో సినిమా చేయాల్సింది. ఇప్పుడు చేశాను.

* ఈ పుట్టినరోజు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారు?
– నా కుటుంబంతో కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్దామనుకుంటున్నా.

*మీ బర్త్ డే కి ఏమైనా స్పెషల్ ఇస్తున్నారా?

– అలాంటిది ఏమి లేదండీ..!

* ఈ సినిమాలో భాషకు బీప్‌లు ఇచ్చారని తెలిసింది?
– అది సినిమా చూశాక మీరే చెప్పండి. ఎందుకు, ఎవరు మాట్లాడారో.
* ఇప్పుడు యువహీరోలు వైవిధ్యంగా సినిమాలు చేస్తున్నారు? దానివల్ల సీరియర్లకు కథలు కరవవుతాయా?
– డిఫినెట్ గా కథలు కథలు తగ్గిపోతాయి. ఉన్న కథల్లోనే మంచివి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ట్రై చెయ్యాలి. లేకపోతె ఎవరు చూడరు.

* ‘బ్రహ్మాస్త్ర’ పోగ్రెస్ ఏంటి ?
– ఆల్ మోస్ట్ షూటింగ్ అయిపోయింది. చిన్న చిన్న ప్యాచ్ వర్కులు బ్యాలెన్స్ వున్నాయి. ఎక్కువగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా ప్రాధాన్యమున్న సినిమా. అందుకే లేట్ అవుతోంది. నాకు చాలా మంచి సినిమా అవుతుంది. పాత్రలకు చాలా
ప్రాధాన్యం ఉంటుంది. సరైన టైమ్‌లో పాత్రల ఎంట్రీ ఉంటుంది. నాకు తెలుగులో మంచి స్ర్కిప్ట్‌లు చేయాలని ఉంది. ఒకవేళ బాలీవుడ్‌లో మంచి స్ర్కిప్ట్‌లు వస్తే, వాళ్లకి నేను అవసరమైతే చేస్తా. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

* బైలింగ్వుల్‌ సినిమాల గురించి మీ అభిప్రాయం ఏంటి ?
– అవి వర్కవుట్‌ కావండీ. నేను ఇప్పటిదాకా నాలుగు సినిమాలు చేశాను. అవేమీ వర్కవుట్‌ కాలేదు. ఎందుకంటే ఎవరి సంస్కృతి, ఎవరి కట్టుబాట్లు, ఆచారాలు వాళ్లకి ఉంటాయి కాబట్టి. ఏమో నాకైతే అవి వర్కవుట్‌ కాలేదు. ఒకవేళ ఎవరికైనా అయితే
ఫర్వాలేదు.
* ‘బిగ్‌బాస్‌’-3 కి మంచి రెస్పాన్స్ వస్తోంది మీరెలా ఫీలవుతున్నారు ?
బిగ్‌బాస్‌ వేరు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’వేరు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడులో నేను మనుషులతో సరదాగా మాట్లాడేవాడిని. ఇప్పుడు మనుషులు వారానికి వారానికి మారిపోతున్నారు. అసలు అనూహ్యంగా మారిపోతున్నారు. వాళ్లను నెక్స్ట్‌
వీక్‌ నేను చూసినప్పుడు నాకు వేరే వ్యక్తిగా కనిపిస్తున్నారు. మనుషుల్ని ఎలా జడ్జి చేయాలో ఇంకా బెటర్‌గా తెలుస్తుంది. నిజానికి 2, 3రోజులు అలాంటి చోట నన్ను వేసినా, నేను ఉండలేను. నా బెడ్‌రూమ్‌నీ, నా బాతరూమ్‌నీ, నా భార్య తప్ప
ఇంకొకరితో షేర్‌ చేసుకోలేను.

* రకుల్‌ ప్రీత్ సింగ్ తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ చెప్పండి?
– రకుల్‌కీ, నాకూ గొడవలు ఉన్నాయని అప్పట్లో ఎవరో, ఏదో రాశారు. కానీ నేను ఆ అమ్మాయిని చూసి అలా ఉండమని చాలా మందికి చెబుతుంటా. అంత హెల్దీగా ఉంటుంది రకుల్‌. ఆమెలా వర్కవుట్లు చేయమని చెబుతుంటా. ఈ చిత్రంలో కీర్తిసురేష్‌,
సమంత కూడా కేమియోలు చేశారు. వాళ్లవి కూడా కీలక పాత్రలు.

* మీ నెక్స్ట్ సినిమా గురించి?

సోగ్గాడే చిన్ని నాయనా కి సీక్వెల్ చేస్తున్నాం. బంగార్రాజు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వాళ్ళ బ్రదర్ చనిపోవడంతో ప్రాజెక్ట్ కొంచెం డిలే అయింది. నేను ఈ సినిమా, బిగ్ బాస్ షోలతో బిజీగా వున్నాను. నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తాం అంటూ ముగించారు కింగ్
నాగార్జున..!!

నాగార్జున ఇంటర్వ్యూ

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All