Homeటాప్ స్టోరీస్హరీష్ చేతిలో తమిళ రీమేక్

హరీష్ చేతిలో తమిళ రీమేక్

Dil raju offers 96 remake to harish shankarగబ్బర్ సింగ్ తో సంచలన విజయం అందుకున్న హరీష్ శంకర్ తాజాగా తమిళంలో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న ” 96” అనే చిత్రానికి తెలుగు లో దర్శకత్వం వహించే గోల్డెన్ చాన్స్ లభించినట్లు తెలుస్తోంది . గతకొంత కాలంగా సరైన సినిమా కోసం ఎదురుచూస్తున్న హరీష్ శంకర్ కు ఇది నిజంగా గోల్డెన్ చాన్స్ అనే చెప్పాలి . అక్టోబర్ 4 న తమిళనాట విడుదలైన 96 చిత్రానికి విడుదలకు ముందే హిట్ టాక్ వచ్చింది , ఇక రిలీజ్ అయ్యాక యునానిమాస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చేసింది . ప్రస్తుతం తమిళనాట హడావుడి అంతా 96 చిత్రానిదే ! విజయ్ సేతుపతి – త్రిష జంటగా నటించిన ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు .

కాగా ఈ సినిమా తెలుగు రీమేక్ కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించే చాన్స్ ఉందని తెలుస్తోంది . దిల్ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ రామయ్యా వస్తావయ్య చిత్రాన్ని చేసాడు అది ఫ్లాప్ అయ్యింది , అయినప్పటికీ అతడి మీద నమ్మకంతో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే చిత్రాన్ని చేసాడు దిల్ రాజు కాకపోతే అది సోలోగా కాకుండా భాగస్వామ్యంతో చేసాడు . ఇక ఈ రీమేక్ చిత్రంలో హీరోగా నాని హీరోయిన్ గా సమంత నటించనున్నట్లు తెలుస్తోంది . త్వరలోనే ఈ సినిమాకు సంబందించి పూర్తీ వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు నిర్మాత దిల్ రాజు .

- Advertisement -

English Title: Dil raju offers 96 remake to harish shankar

Dil raju offers 96 remake to harish shankar

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All